ETV Bharat / crime

మార్కెట్లోకి సరికొత్త మోసం... యాప్​లో రీఛార్జ్​​ పేరిట లక్షలు లూటీ - ఫ్రీ పే... ఫ్రీ రీఛార్జ్​ మోసాలు

లక్ష చెల్లిస్తే... రూ.1.2 లక్షలు రీఛార్జ్​ చేస్తామంటూ ప్రచారం చేశారు. అది విని లక్ష చెల్లించిన బాధితునికి మాత్రం రీఛార్జ్​ కాలేదు. తీరా ఇచ్చిన అడ్రస్​ వెళ్లి చూస్తే... అక్కడ కంపెనీ కూడా లేదు. ఇలా మరో కొత్త సైబర్​ మోసం హైదరాబాద్​లో వెలుగు చూసింది.

new cyber fraud in hyderabad
new cyber fraud in hyderabad
author img

By

Published : Jan 19, 2021, 11:02 PM IST

మరో కొత్త తరహా సైబర్ మోసం హైదరాబాద్​లో వెలుగు చూసింది. లక్ష చెల్లిస్తే రూ.1.2 లక్షలు యాప్​లో రీఛార్జ్ చేస్తామని... అవి విదేశాల్లోనూ వినియోగించుకోవచ్చంటూ అమాయకుల్ని నమ్మించి సైబర్​ నేరగాళ్లు సరికొత్తగా మోసం చేస్తున్నారు. చిక్కడపల్లికి చెందిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయటం వల్ల ఈ విషయం వెలుగు చూసింది.

బాధితుడు ఫ్రీ పే... ఫ్రీ రీఛార్జ్​ పేరిట సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ప్రకటన చూశాడు. గాజులరామారంలో ప్రియాంక టెక్నాలజీస్ అనే సంస్థ ఫ్రీ పే... ఫ్రీ రీఛార్జ్​ పేరిట ఓ యాప్​ను తీసుకొచ్చింది. లక్ష చెల్లిస్తే సభ్యత్వమిస్తారు. తర్వాత ఈ యాప్​ను డౌన్​లోడ్ చేసుకోవాలి. అప్పుడు కంపెనీ యాప్ ఖాతాలో 1.20 లక్షలు జమ చేస్తుంది. ఆ మొత్తాన్ని నెలలోపే ఖర్చు చేయాల్సి ఉంటుందని బ్రోచర్​లో పేర్కొన్నాడు.

ఆ ప్రచారం విని బాధితుడు సభ్యత్వం తీసుకున్నాడు. యాప్ డౌన్​లోడ్ చేసుకున్నాడు. కానీ... ఎంతకూ రీఛార్జ్ కాలేదు. బ్రోచర్​లో పేర్కొన్న చిరునామాకు వెళ్లి చూస్తే అక్కడ కంపెనీ లేదు. మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: సీఐ ఫేస్​బుక్ హ్యాక్ చేసిన సైబర్​ నేరగాళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.