రంగారెడ్డి జిల్లా మంచిరేవుల వద్ద ఫాంహౌస్‌లో పేకాట కేసులో పోలీసుల దర్యాప్తు(Gambling Case in Hyderabad) ముమ్మరంగా కొనసాగుతోంది. పేకాడుతూ పలువురు ప్రముఖులు పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మహబూబాబాద్ మాజీ ఎమ్యెల్యే శ్రీరామ్ భద్రయ్య అరెస్టయినట్లు వెల్లడించారు. పేకాట నిర్వాహకుడు గుత్తా సుమన్.. మరో 29 మందిని ఫామ్‌హౌస్‌కు పిలిచి పేకాట నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఫాంహౌస్‌పై ఆదివారం రాత్రి నిర్వహించిన దాడుల్లో రూ.6,77,250, 31 సెల్ఫోన్లు, 3 కార్లు స్వాధీనం చేసుకున్నామని ... 4 టేబుళ్లలో నగదు పెట్టి పేకాట(Gambling Case in Hyderabad) ఆడుతున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. 30 మందిపై టీఎస్ గేమింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశామని... సీఆర్‌పీసీ 154, 157 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. నార్సింగి పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి... 30 మంది నిందితులను ఉప్పరపల్లి కోర్టుకు తరలించారు.
మంచిరేవుల వద్ద ఉన్న ఓ ఫాంహౌస్‌పై ఎస్వోటీ పోలీసులు ఆదివారం రాత్రి దాడులు(SOT police hyderabad) నిర్వహించారు. ఇందులో ప్రధాన నిందితుడు సుమన్‌పై గతంలోనూ హైదరాబాద్, బెంగళూర్‌లో పలు కేసులు ఉన్నట్లు వెల్లడించారు. నిందితులంతా అదుపులో ఉన్నారన్న పోలీసులు... ఈ కేసులో ఇంకా ఎవరైనా ఉన్నారా? అన్న కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఫాంహౌస్‌ను ఓ యంగ్ హీరో తండ్రి అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తుండగా ఆ వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
నిన్న సాయంత్రం ఏడు గంటల సమయంలో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మంచిరేవుల విలేజ్‌లోని ఓ విల్లాపై రైడ్ చేయడం జరిగింది. ఎస్వోటీ, ఓ మీడియాతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేయండం జరిగింది. అందులో ఒక 30 మంది పేకాట ఆడుతున్న వారిని పట్టుకోవడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఆర్గనైజర్ సుమన్ అని... ఇంతకు ముందు కూడా తనని అరెస్ట్ చేసినట్లు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇంకో గంట, రెండు గంటల సమయంలో ఇంకా ఎవరైనా ఇందులో ఉన్నారా? అనేది తెలుస్తుంది. వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు అదుపులో ఉన్న అందరినీ రిమాండ్ పంపిస్తాం. సుమన్ అనే వ్యక్తి... రవీంద్ర ప్రసాద్ దగ్గర ఒకరోజు బర్త్‌డే పార్టీ కోసం తీసుకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. నాగశౌర్యది అనే ఇన్ఫర్మేషన్ లేదు. రెంటల్ అగ్రిమెంట్ ఇప్పటివరకు రాలేదు. అది వస్తే కన్ఫర్మ్ చేస్తాం. ఇప్పటివరకు ఈ ఫామ్‌హౌస్‌పై ఎలాంటి రికార్డు లేదు. ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. గేమింగ్‌లో పార్టిసిపేట్ చేసిన అందరు కూడా అదుపులో ఉన్నారు.
-శివకుమార్, నార్సింగి సీఐ
బర్త్‌డే వేడుకల కోసం యంగ్ హీరో తండ్రి ఒక రోజుకు సుమన్‌కు ఇచ్చినట్లు సమాచారం. దీనిపై పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. అద్దెకు సంబంధించిన ఒప్పంద పత్రాలు వస్తే పూర్తి సమాచారం తెలుస్తుందని వెల్లడించారు.
ఇదీ చదవండి: Lovers suicide: పెద్దోళ్లు ఒప్పుకోలేదని ప్రేమజంట ఆత్మహత్య