ETV Bharat / crime

Murders in Kamareddy: రెండు హత్యలు... కానీ కారణం మాత్రం వివాహేతర సంబంధమే! - Telangana news

Murders in Kamareddy: కామారెడ్డి జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు హత్యలకు వివాహేతర సంబంధమే కారణమని కామారెడ్డి డీఎస్పీ సోమనాథం తెలిపారు. ఇద్దరు మహిళలు హత్యకు పాల్పడిన వ్యక్తులతో ఏర్పరుచుకున్న శారీరక సంబంధమే వారి ప్రాణాల మీదకు తెచ్చిందని వివరించారు. కామారెడ్డి పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రెండు హత్యలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

Murders in Kamareddy
Murders in Kamareddy
author img

By

Published : Dec 8, 2021, 10:03 PM IST

Murders in Kamareddy: కామారెడ్డి మండలం క్యాసంపల్లి తండాకు చెందిన విస్లావత్ అనిత... జిల్లా కేంద్రానికి కూలీ పనులు చేసుకోవడానికి వెళుతుండేది. ఈ క్రమంలో లింగంపేట మండలం పర్మల్ల తండాకు చెందిన ప్రకాశ్​తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. అనితకు ప్రకాశ్​ లక్ష రూపాయలు ఇచ్చాడు. గత నెల 17న దేవునిపల్లి శివారులోని నిర్మానుష్య ప్రాంతంలో ఇద్దరు శారీరకంగా కలిసిన అనంతరం వారి మధ్య డబ్బుల ప్రస్తావన వచ్చింది. అయితే తనతో ఏర్పరుచుకున్న శారీరక సంబంధంతో ఆ డబ్బులు చెల్లిపోయాయని అనిత చెప్పగా... ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తింది. ఈ క్రమంలో ప్రకాశ్ అనితను చున్నీతో గొంతుకు బిగించి హత్య చేశాడు. అనంతరం కాళ్లకు ఉన్న కడియాలు తీసుకుని పారిపోయాడు.

అనిత కనపడటం లేదని నమోదైన మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాల్ డేటా ఆధారంగా ప్రకాశ్​ను విచారించగా తానే హత్య చేసినట్టుగా ఒప్పుకున్నాడు. మహిళను హతమార్చిన ప్రదేశాన్ని పోలీసులకు చూపించాడు.

మరో హత్య కేసులో...

Murders in Kamareddy: జిల్లాలోని తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన కుంట స్వరూప భర్త మరణించాడు. ఆమె రోజూ కామారెడ్డికి కూలీ పనికి వెళ్లేది. భర్త తమ్ముడు రాజు కూడా పనికి వెళ్లేవాడు. ఈ క్రమంలో రాజు, స్వరూప వివాహేతర బంధం ఏర్పడింది. అప్పుడప్పుడు స్వరూప వద్ద రాజు డబ్బులు తీసుకునేవాడు. కొద్దిరోజులుగా రాజు డబ్బులు అడిగితే ఇవ్వడం మానేయడం, సఖ్యతగా ఉండటం కూడా మానేసింది. గత అక్టోబర్ 28న స్వరూపను తీసుకుని మాచారెడ్డి మండలం వాడి గ్రామ శివారులోని ఓ చెరుకు తోటలోకి తీసుకెళ్లాడు. అక్కడ రాజు తన కోరిక తీర్చుకున్న అనంతరం స్వరూపను చీర కొంగుతో హత్య చేసి ఆమె పర్సులో ఉన్న 800 రూపాయలతో అక్కడి నుంచి పారిపోయాడు.

విచారిస్తే...

అదే రోజు స్వరూప కనిపించడం లేదని తాడ్వాయి పోలీసు స్టేషన్​లో కేసు నమోదైంది. విచారణ చేపట్టిన పోలీసులకు స్వరూప కాల్ డేటా ఆధారంగా ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఈనెల 1న మాచారెడ్డి మండలం వాడి గ్రామ శివారులో స్వరూప మృతదేహం లభించింది. స్వరూప మిస్సింగ్ అయినప్పుడు... మృతదేహం లభించినప్పుడు రెండు సార్లు రాజు కనిపించలేదు. అనుమానం వచ్చిన పోలీసులు రాజును అదుపులోకి తీసుకుని విచారించగా.. తానే హత్య చేసినట్టుగా ఒప్పుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.

అలా వెళ్లొద్దు...

ఈ రెండు కేసులలో ఇద్దరు మహిళలు వివాహేతర సంబంధం కారణంగా హత్యకు గురైనట్లు డీఎస్పీ సోమనాథం వివరించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. తెలిసిన, అపరిచిత వ్యక్తులతో అయినా మహిళలు, చిన్నపిల్లలు ఎవరు కూడా నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ రెండు కేసులను ఛేదించిన కామారెడ్డి రూరల్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి, దేవునిపల్లి, మాచారెడ్డి ఎస్సై రవికుమార్, శ్రీనివాస్ రెడ్డి, ట్రైనీ ఎస్సై శ్రీహిత, కానిస్టేబుల్స్ రవికిరణ్, మురళి, విశ్వనాథం, నరేశ్, కిరణ్‌ను డీఎస్పీ అభినందించారు.

ఇదీ చూడండి: Hyderabad Gang Rape: హైదరాబాద్​లో బాలికపై గ్యాంగ్ రేప్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.