హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్టేషన్ పరిధిలో భారీ చోరీ(theft in hyderabad today) జరిగింది. హెచ్‌బీ బ్యాటరీ కంపెనీలో గుర్తుతెలియని దుండగులు భారీ చోరికి తెగబడ్డారు. అర్దరాత్రి కంపనీలోనికి చొరబడ్డ దుండగులు రూ.50 లక్షల నగదు ఎత్తుకెళ్ళారు. ఉదయం గమనించిన యజమాని సుదర్శనరెడ్డి డబ్బులు మాయం కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్యూస్ టీంలను రంగంలోకి దింపి ఆధారాలను సేకరిస్తున్నారు.
ఇదీ చదవండి: SOT police hyderabad: 'ఫామ్‌హౌస్‌లో పేకాట నిర్వహణపై దర్యాప్తు.. 30మంది అరెస్ట్'