అత్తింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరు పేట గ్రామాంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఏపీలోని కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పెద్దాపురం గ్రామానికి చెందిన తోట కల్పనకు... గ్రామానికి చెందిన నరేష్‌తో ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు.
కొంతకాలంగా భర్త, అత్తామామలు కలిసి కల్పనను వేధింపులకు గురి చేస్తుండటంతో.. మనస్తాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: Accident: స్కూటీని ఢీకొట్టిన లారీ... ఏఎస్సై మృతి