ETV Bharat / crime

Train Hits a Man Adilabad : ఫోన్​ మాట్లాడుతూ పట్టాలపై నడక.. రైలు ఢీకొని యువకుడు మృతి - adilabad train accident today

Train Hits a Man Adilabad : ఇయర్​ఫోన్స్ పెట్టుకుని ఫోన్ మాట్లాడుతూ పట్టాలు దాటుతుండగా.. ఓ యువకుడిని రైలు ఢీకొట్టిన ఘటన ఆదిలాబాద్​లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు.

Train Hits a Man Adilabad
Train Hits a Man Adilabad
author img

By

Published : Dec 24, 2021, 8:51 AM IST

Train Hits a Man Adilabad : వాహనాలు నడిపేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదు. ఇయర్​ఫోన్స్ పెట్టుకుని పాటలు వినకూడదని తరచూ ట్రాఫిక్ అధికారులు చెబుతుంటారు. ఎవరైనా అలా కనిపిస్తే వారిని పక్కకు ఆపి.. హెచ్చరిస్తారు. వాహనం నడుపుతున్నప్పుడు ఈ నిబంధనలు పాటించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశముంది. కానీ రోడ్డుపై నడుస్తున్నప్పుడు కూడా ఈ నిబంధనలు పాటించాల్సిందే. మీరు చెవిలో ఇయర్​ఫోన్స్ పెట్టుకని పాటలు వింటూ వెళ్తుంటే.. వెనక నుంచి వాహనాలు హారన్​ కొట్టినా వినపడక ప్రమాదం జరిగే ఆస్కారముంది. ఫోన్ మాట్లాడుతూ దృష్టి రోడ్డుపై ఉంచకపోతే యాక్సిడెంట్ జరిగే ఛాన్స్ ఉంది. అందుకే రోడ్డుపై నడుస్తున్నప్పుడైనా.. వాహనం నడుపుతున్నప్పుడై దృష్టంతా అక్కడే ఉండాలి. నిబంధనలు తప్పక పాటించాలి.

Man Hit by Train Adilabad : తాజాగా ఇలా చెవిలో ఇయర్​ఫోన్స్ పెట్టుకుని ఫోన్ మాట్లాడుతూ ఓ యువకుడు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. ఈ ఘటన ఆదిలాబాద్​లో జరిగింది. ఆదిలాబాద్​ పట్టణం డాల్డా కంపెనీ కాలనీవాసి కావడే ఆకాశ్(21) ఫోన్ మాట్లాడుతూ పట్టాలు దాటుతున్నాడు. రైలు కూత వినిపించకపోవడం.. అతను చుట్టుపక్కల గమనించకపోవడం వల్ల అటుగా వస్తున్న పర్లి ప్యాసింజర్​ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆకాశ్​ను రైల్వే సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూనే అతడు మృతి చెందాడు. రోజు తమ మధ్య ఎంతో సరదాగా తిరిగే ఆ కుర్రాడు ఇవాళ నిర్జీవంగా పడి ఉండటం చూసి స్థానికులు విషాదంలో మునిగారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.