ETV Bharat / crime

తల్లిని చంపిన కుమారుడు.. అడ్డువచ్చిన చెల్లిపై.. - telangana news

Man Killed his Mother
Man Killed his Mother
author img

By

Published : Jan 24, 2022, 11:11 AM IST

Updated : Jan 24, 2022, 11:45 AM IST

11:04 January 24

Man Killed his Mother: తల్లి మందలించడంతో కోపంతో రాడ్డుతో కొట్టిన సుధీర్‌

Man Killed his Mother
మృతురాలు

Man Killed his Mother: హైదరాబాద్​లోని సుల్తాన్‌బజార్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ కుమారుడు తల్లిని రాడ్డుతో తలపై కొట్టి చంపాడు. సుల్తాన్​బజార్​కు చెందిన సుధీర్​కు కొంత కాలంగా మానసిక స్థితి సరిగా ఉండటం లేదు. ఈ క్రమంలోనే అతను అర్ధరాత్రి లేచి వ్యాయామం చేయడం ప్రారంభించాడు.

కుమారుడు ఆ సమయంలో వ్యాయామం చేయడం చూసిన తల్లి.. అతనిని మందలించింది. దీంతో కోపోద్రిక్తుడైన సుధీర్.. చేతిలో రాడ్డుతో తల్లి తలపై బలంగా కొట్టాడు. అడ్డు వచ్చిన చెల్లిపై కూడా రాడ్​తో దాడి చేశాడు. తల్లి చనిపోయినట్లు గుర్తించిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చెల్లిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని.. కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి: Social Media Posts: సామాజిక మాధ్యమాలపై పోలీసు కన్ను.. విద్వేషాలు రెచ్చగొడితే ఇక అంతే!

Last Updated : Jan 24, 2022, 11:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.