హైదరాబాద్ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. శివ కాలనీకి చెందిన సీహెచ్ పనవ్ అనే వ్యక్తి తన భార్య లిఖితతో కలిసి నివసిస్తున్నాడు. పవన్ జీహెచ్ఎంసీ కార్యాలయంలోని హైటెక్ మిషన్స్ ట్రాన్స్పోర్ట్ సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నాడు. గత కొంత కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం రోజు విధులు ముగించుకొని ఇంటికి చేరుకున్న పవన్‌కి భార్య లిఖితకు మరోసారి గొడవ జరిగింది.
మనస్తాపం చెందిన పవన్ గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతకీ బయటకు రాకపోవడంతో కంగారుపడిన భార్య లిఖిత స్థానికులకు సమాచారం అందజేసింది. తలుపులు బద్దలు కొట్టి చూడగా... ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. పవన్ మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: నవ్వులు పూయిస్తున్న ఏటీఎం దొంగల తతంగం.. ఏం చేశారంటే..!