ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలులో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. పెళ్లూరు సమీపంలో రైలు కింద పడి మరణించారు. మృతులు చీమకుర్తివాసులుగా పోలీసులు భావిస్తున్నారు.
ప్రేమజంట పాలిటెక్నిక్ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. యువకుడు మద్ది వెంకట సాయికృష్ణగా తేల్చారు. తమ ప్రేమ విషయంపై సహకారం కోసం వారం క్రితం చీమకుర్తి పోలీస్ స్టేషన్కు వెళ్లినట్లు తెలిసింది. కులాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలు అంగీకరించరనే భావనతో ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: దూలపల్లి అటవీప్రాంతంలో చెలరేగిన మంటలు