ETV Bharat / crime

Murder: ఓఆర్​ఆర్​పై దారుణం.. సైడ్ ఇవ్వలేదని కొట్టి చంపారు.. - సంగారెడ్డి నేర వార్తలు

వాహనానికి సైడ్​ ఇవ్వలేదని ఓ లారీ డ్రైవర్​పై ఇద్దరు వ్యక్తులు రాడ్​తో దాడిచేశారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన లారీడ్రైవర్​ అక్కడికక్కడే మృతి చెందాడు (lorry driver murder). ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు శివారు బాహ్యవలయ రహదారిపై జరిగింది.

dd
lorry driver brutal murder
author img

By

Published : Jun 27, 2021, 4:24 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు బాహ్యవలయ రహదారిపై దారుణం జరిగింది. వెనుక వస్తున్న వాహనానికి సైడ్​ ఇవ్వలేదని ఓ లారీ డ్రైవర్​ను కిరాతకంగా కొట్టి చంపారు (lorry driver murder). నిందితులను పోలీసులు రాత్రికి రాత్రే పట్టుకున్నారు.

ఏపీలోని కృష్ణాజిల్లా తాడేపల్లికి చెందిన అనిల్...​ సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం నాగులపల్లిలోని స్టీల్​ కంపెనీ నుంచి లారీలో స్టీల్​లోడు వేసుకుని బెంగళూరుకు వెళ్తున్నాడు. అదే సమయంలో వెనుక నుంచి డీసీఎంలో వచ్చిన ఇద్దరు... లారీని ఓవర్​టేక్​ చేసేందుకు ప్రయత్నించారు. అనంతరం లారీని దాటొచ్చి డీసీఎంను అడ్డంగా నిలిపి లారీ డ్రైవర్​ అనిల్​తో గొడవ పడ్డారు. మాటా మాటా పెరిగి ఇనుప రాడ్​తో అనిల్​పై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడు ఘటనాస్థలిలోనే మృతి చెందాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. రాత్రికి రాత్రే నిందితులను అరెస్టు చేశారు.

ఇదీ చూడండి: Accident: రెండు బస్సుల మధ్యలో నలిగి వ్యక్తి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.