ETV Bharat / crime

Live Video: హైవేపై లారీ దగ్ధం.. డ్రైవర్ సేఫ్ - lorry burnt due to out of control and short circuit at national highway 44

లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడటంతో ఇంజిన్‌లో మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది. అప్రమత్తమైన డ్రైవర్‌.. కిందకు దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు. వనపర్తి జిల్లా కొత్తకోట 44 వ నంబరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

lorry burnt on highway
హైవేపై లారీ దగ్ధం
author img

By

Published : Jun 4, 2021, 5:27 PM IST

Updated : Jun 4, 2021, 5:44 PM IST

మంటలు చెలరేగి దగ్ధమవుతున్న లారీ

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం విలియంకొండ సమీపంలో 44వ నంబరు జాతీయ రహదారిపై లారీ టైర్ పగిలి బోల్తా పడింది. కర్నూలు నుంచి దిల్లీకి మామిడి పండ్ల లోడుతో వెళ్తున్న లారీ ముందు టైర్ పగిలి అదుపు తప్పింది. బోల్తా పడినప్పుడు షార్ట్‌ సర్క్యూట్‌ కావడంతో ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ సంతోష్.. వాహనం నుంచి కిందకు దూకి ప్రాణాలు రక్షించుకున్నాడు. ఘటనలో లారీ పూర్తిగా దగ్ధమైంది.

సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. కర్నూలు- హైదరాబాద్ రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ను దారి మళ్లించి పోలీసులు, హైవే సిబ్బంది చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి: దారుణం: గొంతు కోసి తండ్రిని చంపిన కిరాతకుడు

Last Updated : Jun 4, 2021, 5:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.