ETV Bharat / crime

Lockdown effect: మందుబాబుల కోసం లాడ్జినే బార్​గా మార్చేశాడు..

author img

By

Published : Jun 19, 2021, 4:06 PM IST

రాష్ట్రంలో కరోనా లాక్​డౌన్​ సమయం.. వ్యాపారాలు అంతంత మాత్రమే కొనసాగుతున్నాయి. ఇక లాడ్జీలు, సినిమా హాళ్లు, హోటళ్లు అన్నీ మూతపడ్డాయి. కానీ ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా లాడ్జిలో గుట్టుగా వ్యాపారం సాగించాడు ఓ వ్యక్తి. అదేంటో మీరూ చూడండి.

liquor business in lodge
మందుబాబుల కోసం లాడ్జినే బార్​గా

లాక్​డౌన్​లో మందుబాబులు ఇబ్బంది పడకుండా ఏకంగా సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​ సమీపంలోని ఓ లాడ్జిలో బార్​నే ఓపెన్ చేశాడో ప్రబుద్ధుడు. 10 రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా ఈ దందా సాగిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు లాడ్జిపై రైడ్​ చేశారు. కాటన్ల కొద్దీ మద్యం బాటిళ్లు అక్కడ దర్శనం ఇచ్చాయి.

హైదరాబాద్​కు చెందిన మురళి.. లాక్​ డౌన్ సమయంలో లాడ్జిలోని రూంలను లీజుకు తీసుకున్నాడు. నగరంలోని లాడ్జీల్లో గిరాకీలు లేక నిర్వాహకులు ఇబ్బందులు పడుతుంటే.. ఆ లాడ్జి మాత్రం ఎప్పుడూ కస్టమర్లతో నిండిపోయేది. అనుమానం వచ్చి దర్యాప్తు జరిపిన పోలీసులకు అక్కడ బార్ నడుస్తోందని తెలిసింది. రైడ్ చేసి వందల కొద్దీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మురళితో పాటు అతనికి సహకరిస్తున్న వెయిటర్లను అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి: Errabelli : 'కొవిడ్ మరణాలకు కేంద్రమే బాధ్యత వహించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.