రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దాతునగర్లో ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. శ్రీనివాస్ అనే చిరువ్యాపారి తన కిరాణా దుకాణంలో అక్రమంగా సుమారు రూ. 7 లక్షల 20 వేల విలువైన వివిధ రకాల నిషేధిత గుట్కాను నిల్వ ఉంచాడు. గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని స్థానిక పీఎస్‌లో అప్పగించారు.
ఇదీ చదవండి: భర్త ఇంటికి పంపిన మరుసటి రోజే భార్య అనుమానస్పద మృతి!