ETV Bharat / crime

Fraud: ఆమెతో పరిచయం ఖరీదు.. రూ.80 లక్షలు..! - women fraud at vijayawada

డబ్బున్న వారే ఆమె టార్గెట్.. కన్సల్టెంట్‌ పేరుతో పరిచయం పెంచుకుంటుంది.. మాయమాటలు చెప్పి లక్షల రూపాయలు దోచుకుంటుంది. ఆమే... కిలాడీ లేడీ శ్రీదివ్య. తాజాగా ఏపీలోని కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఓ వ్యక్తి నుంచి రూ.80 లక్షలు దోచేసింది. మోసపోయానని ఆలస్యంగా తెలుసుకున్న బాధితుడు ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కిలాడీ లేడి ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మరికొంత మంది ప్రముఖుల సన్నిహితులు బాధితులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

lady-fraud-for-rs-80-lakhs-at-vijayawada
Fraud: ఆమెతో పరిచయం ఖరీదు.. రూ.80 లక్షలు..!
author img

By

Published : Jun 7, 2021, 11:08 AM IST

అందంతో వల వేస్తుంది. తియ్యని మాటలతో ముంచెత్తి.. లక్షలు మాయం చేస్తుంది. ఇలాంటి కిలాడీ లేడీ వ్యవహారం.. బయటపడింది. డబ్బున్న వారిని లక్ష్యంగా చేసుకుని కన్సల్టెంట్‌, ప్రభుత్వ కాంట్రాక్టర్ల పేరుతో పరిచయం చేసుకుంటుంది. పరిచయం పెంచుకుని ఎదుటివారిని ఆకర్షిస్తోంది. వలలో చిక్కాడని గుర్తించి.. నగదు అత్యవసరమని మాయమాటలు చెప్పి.. విడతల వారీగా లక్షల రూపాయలు దోచోస్తోంది. డబ్బు ఇవ్వమని అడిగితే.. తన వద్దే అప్పు తీసుకున్నాడని రివర్స్ కేసు పెడుతుందీ మాయ లేడీ.

ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడకు చెందిన శివకృష్ణ.. మొబైల్ షాపు నిర్వహిస్తుంటాడు. శ్రీదివ్య అనే మహిళ సెల్​ఫోన్ రిపేర్​కు వచ్చి పరిచయం చేసుకుంది. అలా వారిద్దరూ కొద్ది రోజులు ఫోన్​లో మాట్లాడుకున్నారు. పరిచయం స్నేహంగా మారింది. తనకు రూ.కోటిన్నర విలువ చేసే పొలం ఉందని.. ప్రస్తుతం రూ.80లక్షల తాకట్టులో ఉందని చెప్పింది. ఆ భూమిని విడిపించేందుకు నగదు కావాలని సెల్‌ఫోన్‌ షాపు యజమాని శివకృష్ణకు తెలిపింది.

తాకట్టు నుంచి విడిపించిన తర్వాత పొలం విక్రయిస్తే నగదు వస్తుందని శ్రీదివ్య తెలిపిందని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. రోజులు గడిచినా స్థలం అప్పగించకపోవటంతో అనుమానం వచ్చిన శివకృష్ణ ఆమెను నిలదీశాడు. సమాధానం చెప్పకపోవటంతో మొదట పటమట పీఎస్​లో ఫిర్యాదు చేశాడు. సోదరుడితోపాటు రజాక్ అనే ఓ వ్యక్తితో కలిసి ఇదే తరహాలోనే మరికొంత మంది వద్ద డబ్బులు తీసుకుని శ్రీదివ్వ మోసం చేసినట్లు వివరించాడు. పటమట పోలీసులు ఆ ఫిర్యాదును ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్​కు ట్రాన్స్​ఫర్ చేశారు. పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మాయలేడీ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ తరహాలో ఓ కార్పొరేటర్ బంధువు, మరో వ్యాపారస్తుని సన్నిహితుడు పలువురు ఈమె ఉచ్చులో పడి నగదు పోగొట్టుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో బయటపడింది.

ఇదీ చదవండి:Anandaiah medicine: ఇవాళ్టి నుంచి ఆనందయ్య ఔషధం పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.