ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండల కేంద్రంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 5.5 తులాల బంగారం, 13 తులాల వెండి, 17 వేల రూపాయల నగదు, చరవాణి, కారు స్వాధీనం చేసుకున్నారు.
బెంగళూరులో కారును దొంగిలించిన నిందితులు.. మహిళలు, చిన్న పిల్లలను బెదిరించి బంగారు, వెండి ఆభరణాలను దోచుకున్నట్లు పోలీసులు తెలిపారు. వాటిని కర్నూలులోని ఓ మహిళ ద్వారా విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. సొమ్మును విక్రయిస్తున్న మహిళను అదుపులోకి తీసుకున్నామని.. ముఠాలో మరొకరి కోసం వెతుకుతున్నామని జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ తెలిపారు. ఈ ముఠాపై కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని ఎస్పీ వెల్లడించారు.