ETV Bharat / crime

ఇండోర్​లో హైదరాబాద్ యువతి ఆత్మహత్య.. న్యూఇయర్​ పార్టీలో ఎంజాయ్​ చేసిన కాసేపటికే!

Hyderabad engineer commits suicide in Indore: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నగరంలో విషాదం చోటుచేసుకొంది. హైదరాబాద్‌ నగరానికి చెందిన యువతి బహుళ అంతస్థు భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకొంది. గత డిసెంబర్‌ 31న రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

commits suicide
commits suicide
author img

By

Published : Jan 3, 2023, 5:12 PM IST

ఇండోర్‌లో హైదరాబాద్‌ యువ ఇంజినీర్‌ ఆత్మహత్య.. కారణం ఏంటీ?

Hyderabad engineer commits suicide in Indore: హైదరాబాద్‌ నగరానికి ఓ ఇంజినీర్‌ యువతి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నగరంలో గత డిసెంబర్‌ 31వ తేదీన ఎత్తైన భవనం నంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆ రాష్ట్ర పోలీసుల కథనం ప్రకారం హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి ఓ ప్రైవేట్‌ సాప్ట్‌వేర్‌ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తోంది. వర్క్‌ఫ్రం హోమ్‌లో భాగంగా ఇండోర్‌లోనే ఉంటూ ఇంటి దగ్గర నుంచి విధులు నిర్వర్తిస్తోంది.

గత డిసెంబర్‌31న న్యూఇయర్‌లో వేడుకల్లో భాగంగా తన స్నేహితులతో కలిసి ఇండోర్‌లోని టుకోగంజ్‌ పరిధిలో ఓ బహుళ అంతస్థు భవనంలో పార్టీ చేసుకున్నారు. భవనంలోని 31వ ఫ్లోర్‌లో పార్టీ చేసుకున్న ఆమె.. పార్టీ అనంతరం భవనం 7వ ఫోర్ల్‌ నుంచి యువతి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా టుకోగంజ్‌ పోలీసులు ఘటన స్థాలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశిలించి ఆమె దగ్గర నుంచి ఓ సూసైడ్‌ నోట్‌ స్వాధీనం చేసుకున్నారు.

సూసైడ్‌ నోట్‌ లభ్యం: అందులో ఆమె గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు.. ఒత్తిడికి గురవుతున్నట్లు ఇంగ్లీష్‌లో రాసి ఉంది. బహుశా ఆమె ఇదే కారణంతో ఆమె మృతి చెందిందా.. మరి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా..! అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన పోలీసులు.. స్నేహితులు, దగ్గరి వారి నుంచి వాగ్ములం నమోదు చేసుకుంటున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.