ETV Bharat / crime

ఆదిలాబాద్​లో ప్రభుత్వ భూములపై అక్రమార్కుల పంజా.. అధికారుల అండ..!

Government lands kabza in Adilabad: ఆదిలాబాద్‌ జిల్లాలో రూ.వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. భూ బకాసురుల కబ్జా కోరల్లో చిక్కి ప్లాట్లుగా మారుతున్నాయి. అధికారుల అండతోనే అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ భూములు వ్యాపారుల చేతిలోకి వెళ్లి ప్రైవేట్ ఆస్తులుగా మారుతున్న వైనంపై ప్రత్యేక కథనం.

ఆదిలాబాద్​లో ప్రభుత్వ భూములపై అక్రమార్కుల పంజా

author img

By

Published : Feb 13, 2023, 8:50 AM IST

Government lands kabza in Adilabad: ఆదిలాబాద్‌లో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారు. మావల శివారులోని సర్వే నంబర్‌ 346లో 200.30 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 3 దశాబ్దాల క్రితం కలెక్టర్‌, ఎస్పీ నివాసాలు, ఐటీడీఏ క్వార్టర్లు, గాంధీ పార్కు, స్టేడియం, డైట్‌ కళాశాల, ప్రభుత్వ కార్యాలయాలు, పేదల ఇళ్ల స్థలాల కోసం 134.30 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది.

మిగిలిన 66 ఎకరాలను ఎవరికీ కేటాయించలేదు. 1994లో ఆదిలాబాద్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి 25 ఎకరాలు కేటాయించేలా అప్పటి జిల్లా పాలనాధికారి, సర్వే ల్యాండ్‌ రికార్డు రాష్ట్ర కమిషనర్‌ మధ్య ఉత్తర, ప్రత్యుత్తరాలు జరిగినా కేటాయింపులు జరగలేదు. ఒకవేళ ఆ సంఘానికి 25 ఎకరాల భూమి కేటాయించి ఉంటే.. 41 ఎకరాలు మాత్రమే మిగిలి ఉండేది. కానీ కేటాయించకపోవడంతో 66 ఎకరాల భూమి ఉన్నా అధికారుల నిర్లక్ష్యం వల్ల అన్యాక్రాంతం అవుతోంది.

"ఆదిలాబాద్​లో ప్రభుత్వ భూములు మెత్తం ఎన్ని ఎకరాలు ఉన్నాయో సర్వే చేయడానికి సీఎం క్యాంప్​ ఆఫీస్ నుంచి ఉత్తరం వచ్చినాా కలెక్టర్​ పట్టించుకోవడం లేదు. ఆర్డీవో దగ్గర నిరీక్షణలో ఉంచుతున్నారు. దీనికి ముఖ్యకారణం అధికారుల తప్పిదాల వల్ల విలువైన ప్రభుత్వ భూములు పేదోడికి దక్కకుండా కబ్జారాయుళ్ల పాలు అవుతున్నాయి". -అరుణ్‌ కుమార్‌, సామాజిక కార్యకర్త

సిబ్బందితో పాటు డివిజన్‌ స్థాయి అధికారుల తోడ్పాటుతోనే..: జిల్లా పాలనాధికారి, జిల్లా అదనపు పాలనాధికారి, జిల్లా ఎస్పీ అధికారిక నివాసాలు కలిగిన 346 సర్వే నెంబర్‌లోని ప్రభుత్వ భూమి పరులపాలవుతోంది. తహసీల్దార్‌, ఆర్డీవో కార్యాలయాల్లో పని చేసే కింది స్థాయి సిబ్బందితో పాటు డివిజన్‌ స్థాయి అధికారుల తోడ్పాటుతోనే స్థిరాస్తి వ్యాపారులు ప్రభుత్వ భూములను కజ్జా చేస్తున్నారని ఆరోపణలున్నాయి.

"ప్రభుత్వ భూములు ఇలా కబ్జా కావడానికి ఎవరెవరి హస్తం ఉందో వారిపై చర్యలు తీసుకోవాలి. అధికారులు, ప్రజాప్రతినిధుల అండతోనే రియల్​ఎస్టేట్​ వ్యాపారులు ప్రభుత్వ భూములను కబ్జా చేశారు. అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని పేదలకు అందేలా చూడాలి."-మల్లేశ్‌, ప్రజా సంఘాల బాధ్యుడు

రూ.వేల కోట్ల విలువ చేసే భూములను కనీసం సర్వే చేయడానికి అధికారులు ఆసక్తి చూపకపోవడం వల్ల.. స్థిరాస్తి వ్యాపారులతో లోపాయికారి ఒప్పందం ఉందనే విమర్శలకు బలం చేకూరుస్తోంది.

ఆదిలాబాద్​లో ప్రభుత్వ భూములపై అక్రమార్కుల పంజా

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.