ETV Bharat / crime

యథేచ్ఛగా సాగుతోన్న అక్రమ మట్టి తవ్వకాల దందా..! - మట్టి మాఫియా

నాగర్ కర్నూల్ జిల్లాలో అక్రమ మట్టి తవ్వకాల దందా యథేచ్ఛగా సాగుతోంది. స్థానిక రాజకీయ నేతల అండదండలతో మట్టి మాఫియా రెచ్చిపోతున్నట్లు తెలుస్తోంది. అన్నీ తెలిసినా.. అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

illegal-excavations
యథేచ్ఛగా మట్టి దందా
author img

By

Published : May 19, 2021, 10:40 AM IST

కృష్ణానది పరివాహక ప్రాంతంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. నాగర్ కర్నూల్ జిల్లాలో.. మట్టిని యథేచ్ఛగా తరలిస్తూ అక్రమార్కులు కాసులు దండుకుంటున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఏటా ఇదే తతంగం..!

పెంట్లవెళ్లి మండలం మంచాలకట్ట పరిధిలోని కృష్ణానది నుంచి అక్రమమగా నల్లమట్టిని తరలిస్తోన్న టిప్పర్లను.. స్థానిక కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. వేసవికాలం కావడం.. నదిలో నీరు తగ్గుముఖం పట్టడంతో మట్టి మాఫియా రంగంలోకి దిగినట్లు పార్టీ మండలాధ్యక్షుడు గోవు రాజు పేర్కొన్నారు. ఏటా ఇదే తతంగం నడుస్తోన్నా.. అధికారులు మాత్రం నిద్ర మత్తు వీడడం లేదని మండిపడ్డారు. రైతుల పేరు చెప్పి మరి దోచుకుంటున్నారని ఆరోపించారు.

'అధికారుల ప్రోత్సాహంతోనే'

టిప్పర్ ఒక టిప్పు మట్టికి రూ.4 నుంచి 6 వేల వరకు వసూలు చేస్తుంటారని గోవు రాజు పేర్కొన్నారు. వందల టిప్పర్లలో మట్టిని తరలించి రూ.లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ నుంచి పై అధికారుల వరకు.. అందరి ప్రోత్సాహంతో మట్టి మాఫియా రెచ్చి పోతోందని ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి అక్రమాలను అడ్డుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

యథేచ్ఛగా మట్టి దందా

ఇదీ చదవండి: పోలీస్​స్టేషన్​లో మహిళా కానిస్టేబుల్​ 'పెళ్లి' పంచాయితీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.