ETV Bharat / crime

Maoist Dump in AOB: ఏవోబీ సరిహద్దులో మావోయిస్టుల భారీ డంప్‌..

Maoist Dump in AOB: ఆంధ్రా- ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు చెందిన భారీ డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జొడొంబో పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని క‌టాఫ్ ఏరియా ప్రాంతంలో ఒడిశాకు చెందిన మ‌ల్కన్‌గిరి పోలీసులు.. సోదాలు నిర్వహించగా డంప్‌ బయటపడింది.

Dump At AOB: ఏవోబీ సరిహద్దులో భారీ డంప్‌.. పేలుడు సామగ్రి, యంత్రాలు స్వాధీనం

author img

By

Published : Dec 25, 2021, 4:21 PM IST

Maoist Dump in AOB: ఆంధ్రా-ఒడిశా స‌రిహ‌ద్దుల్లో మావోయిస్టుల‌కు చెందిన భారీ డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జొడొంబో పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని క‌టాఫ్ ఏరియా ప్రాంతంలో.. ఒడిశా మ‌ల్క‌న్‌గిరి పోలీసులు ఇంటెన్సివ్ సెర్చ్, ఏరియా డామినేష‌న్ నిర్వ‌హించగా భారీ డంప్ బయటపడింది. ఇందులో పేలుడు సామగ్రి, యంత్రాలు ఉన్నాయి. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

డంప్‌లో ఒక జనరేటర్, కోడెక్స్ తీగ, ఆరు ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, ఎలక్ట్రిక్ తీగలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కోడెక్స్ వైర్ బ్లాస్టింగ్ శ‌క్తిని పెంచుతుంద‌న్నారు. ఈ డంప్ ఏవోబీ ఎస్‌జ‌డ్‌సీ క్యాడ‌ర్‌కు చెందిన‌విగా అనుమానిస్తున్న‌ట్లు తెలిపారు. పౌరులు, పోలీసులు ల‌క్ష్యంగా దాడులు చేసేందుకు ఈ ఆయుధాలను దాచినట్లు అనుమానిస్తున్న‌ామన్నారు. ఈ ప్రాంతంలో అదన‌పు బ‌ల‌గాల‌ సహాయంతో గాలింపు చ‌ర్య‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

Child Kidnap Drama: బంధువులకు దగ్గరవ్వాలని.. చిన్నారి కిడ్నాప్.. చివరకు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.