ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా హిందూపురం పట్టణ శివారులో దారుణ హత్య జరిగింది. కొట్నుర్ కొల్లగుంట గ్రామాల మధ్య గుర్తుతెలియని వ్యక్తిని దుండగులు గొంతు కోసి హత్య చేసి... ఆపై డీజిల్ పోసి నిప్పంటించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. మృతి చెందిన వ్యక్తి ఒక హిజ్రా అని తెలిపారు. మృతదేహాన్ని హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
ఇదీ చూడండి: 'ఈ కిరాతకుడి చేష్టలు వింటే గగుర్బాటు తప్పదు'