పీవీ నాగమణి: సార్ నేను పీవీ నాగమణి అడ్వకేట్‌ను మాట్లాడుతున్నాను.
డీసీపీ: నమస్తే చెప్పండమ్మ!
నాగమణి: మా గ్రామం గుంజపడుగులో రామాలయం గురించి సీపీ సత్యనారాయణ గారికి చాలాసార్లు ఫిర్యాదులు ఇచ్చాం సార్.
డీసీపీ: ఏమిటమ్మ ఆ ఇష్యూ!
నాగమణి: కుంట శ్రీనివాస్ అనే వ్యక్తి రామాలయంలోకి వచ్చి నానా బీభత్సం సృష్టిస్తున్నారు సార్. హోమం పెట్టుకుంటే డిస్ట్రర్బ్ చేస్తున్నారు.
డీసీపీ: ఆలయానికి కమిటీ లేదామ్మా!
నాగమణి: ఉంది సార్. అది కమిటీ కాదు అని గొడవ చేస్తున్నారు.
డీసీపీ: అయితే కోర్టుకు వెళ్లండమ్మా.
నాగమణి: సర్పంచ్ గారూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు సార్.
డీసీపీ: అమ్మా.. నా మాట విను. ఇది పోలీసులకు సంబంధించిన విషయం కాదమ్మా. లీగల్‌గా మీరు వెళ్లాలి. మీరు గొడవ పడితేనే వెళ్లాలని కింది అధికారులకు ఆదేశాలిస్తాం. ఫిర్యాదు కూడా గ్రామ సర్పంచి ద్వారా చేయాలి.
నాగమణి: ఆలయంలో గొడవ జరిగిందని ఛైర్మన్, సర్పంచి సీపీకి ఫిర్యాదు చేసినప్పటికి స్పందించలేదు సార్.
డీసీపీ: పోలీసులను ప్రతిదానికీ లాగొద్దు. సర్పంచికి చెబుతాం. గ్రామసభ పెట్టి తీర్మానం చేసుకుంటే రక్షణ కల్పిస్తామని చెబుతాం. అంతే.. ప్రతి గొడవకు మేమే రానవసరం లేదు. కానిస్టేబుల్ ఉన్నా మేమున్నట్టే.
నాగమణి: అంటే గొడవలై చనిపోయినా ఎండోమెంట్‌కే చెప్పాలా సార్. పోలీసులు రారా! అటాక్ చేసినా స్పందించరా? చంపేసినా అంతేనా?
డీసీపీ: గ్రామ పంచాయతీకి, సర్పంచికి సంబంధం అమ్మా. మాకు ఉండదు. దేశంలో ఎన్నో గుళ్లు ఉన్నాయి. అన్నింటికీ భద్రత అంటే కష్టం అమ్మా.. ఓకే.
వామన్‌రావు సోదరుడితో కుంట శ్రీను వాగ్వాదం!
న్యాయవాది వామన్‌రావు దంపతులను హతమార్చడానికి మూడు రోజుల ముందు ప్రధాన నిందితుడు కుంట శ్రీను.. వామన్‌రావు సోదరుడైన ఇంద్రశేఖర్‌తో ఫోన్లో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఆలయ కమిటీ గురించి, గుడి తాళం చెవుల గురించి కుంట శ్రీను నొక్కినొక్కి అడిగినట్లు అర్థమవుతోంది. ‘‘ఏంటి శేఖర్ ఇదీ.. గమ్మత్తా ఇదేమన్నా. ఊరని అనుకుంటున్నారా? ఇంకేమైనానా? అన్నదమ్ములు ఇద్దరు కలిసి.. గ్రామ ప్రజల గుడిని కూలగొడతామని వచ్చారా?’’ అంటూ శేఖర్‌ను ప్రశ్నించడం.. ‘‘అదేం లేదు. నేను చేయలేదు. నాకు తెలియదు శీను’’ అని శేఖర్ బదులుగా చెప్పిన మాటలు వినిపిస్తున్నాయి. ఆ ఫోన్ సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
- ఇదీ చూడండి: వామన్‌రావు దంపతుల హత్యా స్థలికి నిందితులు