ETV Bharat / crime

scam scam: లక్కీడ్రాలో గిఫ్టు వస్తుందన్నారు... డబ్బు కట్టించుకుని ముఖం చాటేశారు - లక్కీ స్కీం పేరుతో మోసాలు

తెల్లారితే లీటరు పెట్రోలుపై అర్ధరూపాయి పెరుగుతుందని తెలిస్తే... రాత్రంతా క్యూలో నిలుచుని పెట్రోలు కొట్టించుకునే పరిస్థితి వారిది. ఏ వస్తువైనా కొనుక్కోవాలంటే ఒకటికి వందసార్లు ఆలోచించి ఖర్చు చేస్తారు. అందుకే వాయిదాల పద్ధతికే మొగ్గు చూపుతారు. అలాంటి మధ్యతరగతి కుటుంబాలు.... స్కీముల మోసాల్లో (scheme scam) ఈజీగా ఇరుక్కుపోతున్నారు. ఇలాంటి ఘటనే జరిగింది మెదక్​ పట్టణంలో.

good lucky enterprises scheme scam
good lucky enterprises scheme scam
author img

By

Published : Jun 29, 2021, 6:22 PM IST

"ప్రతినెలా వెయ్యి రూపాయలు కట్టండి.. పదమూడు నెలల కాల వ్యవధిలో ఏదొక లక్కీ గిఫ్ట్​ పొందండి. ఏ బహుమతి తగలకపోతే కాలపరిమితి పూర్తయిన తర్వాత మీ సొమ్ము వాపసు ఇస్తాము." ఇలాంటి ప్రకటన కనిపించిన వెంటనే మధ్యతరగతి కుటుంబాలు సులువుగా బుట్టలో పడిపోతున్నారు. ఒకేసారి ఆర్థిక భారం పడకుండా ఇలా అయినా ఏదొక వస్తువు వస్తుంది కదా అనే చిన్న ఆశతో స్కీములో చేరిపోతుంటారు. ఇదే అదనుగా మోసగాళ్లు వేల రూపాయలు కాజేస్తున్నారు. తాజాగా మెదక్​ జిల్లా పట్టణంలో స్కీముల పేరుతో (scheme scam) మోసపోయామని బాధితులు పోలీస్​ స్టేషన్​ను ఆశ్రయించారు.

లక్కీ స్కీము పేరుతో వేల రూపాయలు కట్టి మోసపోయిన తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కామారెడ్డిలో గుడ్​లక్కీ ఎంటర్​ ప్రైజెస్​ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి ప్రతి నెల వెయ్యి రూపాయలు చెల్లిస్తే లక్కీ డ్రాలో రకరకాల వస్తువులు ఇస్తామని ప్రకటనలు గుప్పించి ఏజెంట్ల ద్వారా సొమ్ము వసూలు చేసి.. కొన్ని నెలలు పాటు సజావుగా నిర్వహించి ఆఖరిలో బోర్డు తిప్పేశారని బాధితులు వాపోతున్నారు.

పట్టాగొలుసు వచ్చిందన్నాడు.. పత్తా లేకుండా పోయాడు

గుడ్​లక్కీ ఎంటర్​ప్రైజెస్​ స్కీములో నెల నెల వెయ్యి రూపాయలు చొప్పున కట్టినా.. నాకు పట్టా గొలుసులు, నా బిడ్డకు కమ్మలు వచ్చాయని మా ఏజెంటు చెప్పాడు. సర్లే తెచ్చి ఇమ్మంటే రేపిస్తా మాపిస్తానంటూ నెట్టుకొచ్చాడు. ఇప్పుడేమే ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయాడు. మేము కట్టిన సొమ్ము తిరిగిచ్చేయాలి - బాధితురాలు

ఇలా కాజేశారు..

కామారెడ్డి జిల్లా కేంద్రంగా గుడ్​లక్కీ​ ఎంటర్​ప్రైజెస్​ పేరిట రెండేళ్ల క్రితం సంస్థను ఏర్పాటు చేశారు. మెదక్, హవేళీ ఘనపూర్​ మండలాల్లోని అవుసులపల్లి, చౌట్లపల్లి, రాజిపేట, బూర్గుపల్లి, గాజిరెడ్డిపల్లితో పాటు మరికొన్ని గ్రామాలకు చెందిన సుమారు వంద మందికిపైగా ఈ స్కీమ్​లో సభ్యులుగా చేరారు. 13 నెలల కాల వ్యవధితో లక్కీ డ్రా స్కీము ఏర్పాటు చేసి సొమ్ము వసూలు చేశారు. స్కీములో సొమ్ము కట్టిన కొందరికి బైక్​లు, పట్టగొలుసులు, ఫ్రిజ్​​లు ఇచ్చారు. అయితే అందరికీ బహుమతులు రాలేదు. ఈలోగా కాలపరిమితి పూర్తయింది. మిగిలిన బాధితులంతా తాము కట్టిన సొమ్ము ఇచ్చేయాలని సంస్థమీద పడ్డారు.

పోలీసులకు ఫిర్యాదు

ఏజెంట్ల నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో బాధితులు ఏజెంట్లను మెదక్​ ఠాణాకు తీసుకొచ్చారు. ఎక్కువ మంది ఠాణాలోకి దూసుకురావడం వల్ల పోలీసులు వారిని అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు రోడ్డుపైనే నిరసన చేపట్టారు. డబ్బు కట్టిన వారికి బహుమతులు ఇవ్వాలని.. లేదంటే కట్టిన సొమ్ము ఇచ్చేయాలని డిమాండ్​ చేశారు.

కనీసం కట్టిందైనా ఇమ్మనండి

ప్రతినెలా మావద్ద నుంచి వెయ్యి రూపాయలు కట్టించుకున్నారు. ప్రతి నెలా కామారెడ్డిలో డ్రా తీసి ఎవరికైతే వస్తువులు వచ్చాయో ఇచ్చేవారు. మూడువేల మందిలో చివరికి చాలామంది మిగిలాం. వాయిదాలు పూర్తైపోయాయి. మాకు వస్తువులు ఇస్తామని చెప్పి మూడు నెలల నుంచి తిప్పిస్తున్నారు. లాక్​డౌన్​ సమయంలో ఇవ్వలేమంటే ఎదురు చూశాం. ఓనరు పోలీస్​ స్టేషన్​లో ఉన్నాడని చెబితే అందరం వచ్చాం. ఇక్కడేమే పోలీసులు లాఠీలతో తరుముతున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని బతికేటోళ్లం.. కనీసం మేము కట్టిన డబ్బులైనా ఇప్పించండి - గుడ్​లక్కీ ఎంటర్​ప్రైజస్​ బాధితుడు

బాధితులు ఆందోళన ఉద్ధృతం కావడం వల్ల ఏజెంట్లను ఆటోలో హవేళీ ఘనపూర్​ ఠాణాకు తరలించగా... బాధితులు అక్కడకు కూడా వెళ్లి ఆందోళన చేపట్టారు. నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో శాంతించారు. ఏజెంట్లను ఠాణాలోనే ఉంచారు.

ఇదీ చూడండి: కుటుంబ కలహాలతో ఒకరు.. అతడిని కాపాడబోయి మరొకరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.