ETV Bharat / crime

శంషాబాద్‌ విమానాశ్రయంలో రూ.1.65 కోట్ల విలువైన బంగారం పట్టివేత - Shamshabad airport news

Gold worth Rs 1.65 crore seized at Shamshabad airport
శంషాబాద్‌ విమానాశ్రయంలో రూ.1.65 కోట్ల విలువైన బంగారం పట్టివేత
author img

By

Published : Jun 2, 2022, 4:31 PM IST

Updated : Jun 2, 2022, 5:51 PM IST

16:27 June 02

శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో.. మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడిపై నిఘాపెట్టిన కస్టమ్స్‌ అధికారులు విమానాశ్రయంలోని కొవిడ్ నిర్ధారణ కేంద్రంలోకి వెళ్లడాన్ని గమనించారు. కొవిడ్ ల్యాబ్‌లోని.. చెత్తబుట్టలో ప్లాస్టిక్ కవర్‌ను పడేశాడు. అనుమానం వచ్చిన అధికారులు అతడిని అదుపులోకి తీసుకొని.. డస్ట్‌బిన్‌లోని ప్లాస్టిక్ కవర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

అందులోని 6 చిన్న చిన్న ప్యాకెట్లు పరిశీలించగా.. 2 ప్యాకెట్లలో బిస్కెట్లు, మరో 4 ప్యాకెట్లలో పేస్ట్‌రూపంలో ఉన్న కోటి 65 లక్షల విలువైన.. 3 కిలోల14 గ్రాముల పుత్తడిని స్వాధీనం చేసుకున్నారు. కొవిడ్ నిర్ధారణ కేంద్రంలో పనిచేస్తున్న ప్రైవేట్ ఉద్యోగి... డస్ట్ బిన్‌లో పడేసిన ప్లాస్టిక్ కవర్‌ను విమానాశ్రయం బయట అందించేలా స్మగ్లర్‌తో ఒప్పందం చేసుకున్నట్లు నిర్ధరించిన కస్టమ్స్‌అధికారులు ఇద్దరిని అరెస్టుచేశారు.

ఇవీ చదవండి:CM KCR : 'తెలంగాణ సజల, సుజల, సస్యశ్యామలంగా మారింది'

Last Updated : Jun 2, 2022, 5:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.