ETV Bharat / crime

GANG WAR IN GUNTUR: యువకునిపై అల్లరిమూకల దాడి.. వీడియో వైరల్

author img

By

Published : Apr 2, 2022, 2:09 PM IST

Gang war: ఏపీలోని గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్‌స్టేషన్ పరిధిలో అల్లరిమూకల ఆగడాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. స్వర్ణభారతీ నగర్‌కు చెందిన ఓ యువకుడు.. ప్రత్యర్థి వర్గంలోని యువకుడితో స్నేహంగా ఉంటున్నాడని సుమారు 10 మంది కలిసి దాడికి పాల్పడ్డారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. అయితే నిందితులను పోలీసులు ఇప్పటివరకు అదుపులోకి తీసుకోలేదు.

GANG WAR IN GUNTUR
గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్‌స్టేషన్ పరిధిలో అల్లరిమూకల ఆగడాలు

Gang war: ఏపీలోని గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్‌స్టేషన్ పరిధిలో అల్లరిమూకల ఆగడాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. స్వర్ణభారతీ నగర్‌కు చెందిన యువకుడు ప్రత్యర్థి వర్గంలోని యువకుడితో స్నేహంగా ఉంటున్నాడని రెండురోజుల కిందట కర్రలు, రాళ్లతో దాడిచేశారు. సుమారు 10 మంది ఇష్టారీతిన చావబాదారు. వారందరూ అల్లరిమూక కావడం వల్ల యువకుడిని రక్షించడానికి ఎవరూ సాహసం చేయలేదు. కొందరు నల్లపాడు స్టేషన్‌కి ఫోన్ చేయడం ఆ వెంటనే పోలీసులు రావడంతో అల్లరిమూక పరారైంది.

వెంటనే బాధితుడిని పోలీసులు జీజీహెచ్​కు తరలించారు. ఘర్షణకు పాత గొడవలే కారణమా? లేక ఇంకైమనా కారణముందా అన్న కోణంలో.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువకుడిపై మూకుమ్మడి దాడి చేసిన వీడియో.. సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఘర్షణ జరిగి రెండు రోజులు కావస్తున్నా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకోకపోవడం ప్రశ్నార్ధకంగా మారింది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.