ETV Bharat / crime

ఏపీ నుంచి హైదరాబాద్​కు గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్​

ఏపీ నుంచి హైదరాబాద్​కు గంజాయి తరలిస్తున్న ముఠాను ఉప్పల్​ వద్ద ఎక్సైజ్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. వీరి నుంచి సుమారు రూ.10 లక్షలు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నగర శివారులోని కళాశాల విద్యార్థులు, యువతకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

cyber crime arrested ganja muta
హైదరాబాద్​కు గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్​
author img

By

Published : Apr 5, 2021, 5:11 AM IST

కళాశాల విద్యార్థులే లక్ష్యంగా ఏపీ నుంచి హైదరాబాద్​కు గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఉప్పల్‌ ఎక్సైజ్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

రామాంతపూర్​ ప్రాంతానికి చెందిన ఉప్పలయ్య, జయరాజు.. గత కొంత కాలంగా ఏపీ నుంచి అక్రమంగా గంజాయి తీసుకొచ్చి నగర శివారు ప్రాంతంలోని కళాశాల విద్యార్థులు, యువతకు సరఫరా చేస్తున్నారు. ఉప్పల్‌ మెట్రో రైల్వే స్టేషన్‌ సమీపంలో ఎక్సైజ్‌ సీఐ చంద్రశేఖర్‌గౌడ్‌ తన సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానంతో కారును ఆపి తనిఖీ చేశారు. అందులో ఉన్న సుమారు రూ.10 లక్షలు విలువ చేసే గంజాయిని గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. మహబూబ్‌నగర్‌కు చెందిన మరో నిందితుడు గండిమల్ల కుమార్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో వీరిపై కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇవీచూడండి: పంట ఎండిపాయే... అప్పు పెరిగిపాయే... చావే దిక్కాయే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.