ETV Bharat / crime

బట్టలు ఆరేస్తుండగా షాక్.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి - కామారెడ్డి జిల్లాలోఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

Four members of the same family died due to electrocution in kamareddy district

author img

By

Published : Jul 12, 2022, 3:07 PM IST

Updated : Jul 12, 2022, 4:44 PM IST

14:57 July 12

కామారెడ్డి జిల్లాలో విషాదం

కామారెడ్డి జిల్లా బీడీ వర్కర్స్‌ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. భార్య, భర్త సహా ఇద్దరు పిల్లలు మృత్యువాత పడ్డారు. మృతులు హైమద్ (35), పర్వీన్ (30), అద్నాన్ (4), మాహిమ్ (6)గా పోలీసులు నిర్ధారించారు. ఇంట్లో విద్యుత్ తీగలు తగిలి నలుగురు కుటుంబసభ్యులు మృతి చెందినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తలించారు.

ఇదీ జరిగింది.. మృతులు రేకుల షెడ్డులో నివాసం ఉంటున్నారు. బట్టలు ఆరేసుకునేందుకు ఇనుపతీగను కట్టారు. 3 రోజులుగా వర్షం కురవడంతో ఇనుప తీగ విద్యుత్ మీటర్‌కు తగిలి ఒక్కసారిగా కరెంట్ పాస్ అయింది. మొదట తల్లి పర్వీన్ బట్టలు ఆరేసేందుకు వెళ్లింది. కరెంట్ షాక్ తగలడంతో గట్టిగా అరిచింది. ఏమైందో అని ఆమె భర్త పర్వీన్ వద్దకు వెళ్లగా.. అతనికి షాక్ కొట్టింది. అదే సమయంలో పిల్లలిద్దరూ తల్లిదండ్రుల వద్దకు వెళ్లగా.. విద్యుత్ ప్రసరిస్తున్న వైర్ తగిలి ఒక్కసారిగా నలుగురు విద్యుదాఘాతానికి గురయ్యారు.

వారి అరుపులతో స్థానికులు విద్యుత్ ప్రమాదం జరిగిందని గుర్తి.. అధికారులకు సమాచారం అందించారు. వారు విద్యుత్ సరఫరా నిలిపివేయగా.. వెంటనే వారిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పిల్లలను బతికించే ప్రయత్నం చేసినా.. ఫలితం లేకపోయింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. వర్షం, కరెంటు నలుగురి ప్రాణాలు తీసుకుందని స్థానికులు అనుకుంటున్నారు.

ఇవీ చదవండి :

Last Updated : Jul 12, 2022, 4:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.