Road Accidents in Telangana : రాష్ట్రంలో తెల్లవారుజామున జరిగిన వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందగా... పలువురు గాయాలపాలయ్యారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్ వద్ద కారు, హార్వెస్టర్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు యువకులు.... ఘటనాస్థలంలోనే ప్రాణాలు విడిచారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు చొప్పదండికి చెందిన అక్షయ్, శివగా గుర్తించారు. సోదరుని పెళ్లి విందు ఏర్పాట్లలో భాగంగా కారులో వెళ్తుండగా.... ప్రమాదం జరిగింది.
Road Accident at Hayathnagar : హైదరాబాద్ హయత్‌నగర్ వద్ద కారు, బైకు ఢీకొన్న ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మృతుడు కుంట్లూరుకు చెందిన రఘురాంగా పోలీసులు గుర్తించారు. మోటార్‌సైకిల్‌ను ఢీకొన్న అనంతరం... కారు ఇంట్లోకి దూసుకెళ్లడంతో ప్రహరీ గోడ కూలిపోయింది.
Road Accident at Jiyaguda : హైదరాబాద్ జియాగూడ వద్ద జరిగిన మరో ఘటనలో మహిళ దుర్మరణం చెందింది. టేల్ హోటల్ నుంచి పురానాపూల్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా... వెనునక నుంచి వేగంగా ద్విచక్రవాహనం ఢీకొంది. తీవ్రగాయాలపాలైన మహిళను ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ చనిపోయింది.
ఇవీ చదవండి :