హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దూలపల్లిలోని రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. భారీ శబ్దాలతో రసాయన డ్రమ్ములు ఎగిరిపడుతున్నాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనస్థలానికి చేరుకున్నారు. రెండు అగ్నిమాపక యంత్రాలతో మంటలార్పుతున్నారు. ఈ ఘటనలో ఒకరికి గాయాలు కాగా క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి: వైమానిక దళానికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు