కరీనగర్ జిల్లా కేంద్రంలోని ఓ తినుబండారాల దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉండవచ్చునని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదని వెల్లడించారు.
ఇదీ చదవండి: కారు, ద్విచక్ర వాహనం ఢీ.. ఒకరు మృతి