ETV Bharat / crime

జ్యువెలరీ దుకాణంలో అగ్నిప్రమాదం.. ఆభరణాలు దగ్ధం - fire accident in Nampally

హైదరాబాద్​లోని ఓ బంగారు ఆభరణాల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షాపు యజమాని సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఆభరణాలు, వివిధ వస్తువులు దగ్ధమయ్యాయి.

fire accident in jewellery shop at Nampally in Hyderabad
జ్యువెలరీ దుకాణంలో అగ్నిప్రమాదం
author img

By

Published : Mar 22, 2021, 1:44 PM IST

హైదరాబాద్ నాంపల్లిలోని యూసిఫియాన్ దర్గా వెనుకభాగాన ఉన్న బంగారు ఆభరణాల దుకాణంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. పక్కనే ఉన్న చిన్నదుకాణాలకు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది బయటకు పరుగులు తీశారు. అనంతరం అగ్నిమాపక బృందానికి సమాచారం అందించారు.

fire accident in jewellery shop at Nampally in Hyderabad
జ్యువెలరీ దుకాణంలో అగ్నిప్రమాదం
fire accident in jewellery shop at Nampally in Hyderabad
జ్యువెలరీ దుకాణంలో అగ్నిప్రమాదం

ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో దుకాణంలోని ఆభరణాలు, వివిధ వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. విద్యుత్ తీగల నుంచి చెలరేగిన నిప్పు అంటుకుని ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.

ఘటనాస్థలికి వెళ్లే రహదారులు ఇరుకుగా ఉండటం వల్ల అగ్నిమాపక సిబ్బంది.. నానా అవస్థలు పడాల్సి వచ్చింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం వల్ల స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.