ETV Bharat / crime

father harassment: కన్న బిడ్డలతో అసభ్య ప్రవర్తన.. - తెలంగాణ వార్తలు

స్నేహితుడితో కలిసి ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడు... కన్న బిడ్డలతోనే అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా... ఇరువురిపై జూబ్లీహిల్స్‌ ఠాణాలో పోక్సో చట్టం కింద కేసులు నమోదయ్యాయి.

father-harrased-his-own-children-in-hyderabad
కన్న బిడ్డలతో అసభ్య ప్రవర్తన..
author img

By

Published : Jul 26, 2021, 9:56 AM IST

కన్న పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనలో ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడు​పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్​లో పోక్సో కేసు నమోదైంది. అతనితో పాటు మరో వ్యక్తిపై కూడా పోలీసులకు ఫిర్యాదు అందింది.

అసలేమైంది...?

వరంగల్‌ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడైన ఎన్‌ఆర్‌ఐ(45) జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 70లో భార్య, కుమార్తె(14), కుమారుడు(11)తో కలిసి ఉంటున్నాడు. 2018లో ఏర్పడిన గొడవల నేపథ్యంలో దంపతులు వేర్వేరుగా ఉంటున్నారు. విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. కొద్ది కాలంగా పిల్లలు ఇద్దరు దిగులుగా ఉండటంతో తల్లి వారిని ఒక సైకాలజిస్టు వద్ద కౌన్సెలింగ్‌కు తీసుకెళ్లారు.

తండ్రి, అతడిి స్నేహితుడు...

ఈ నేపథ్యంలోనే.. తండ్రి తమతో అయిదారేళ్ల కిందట అసభ్యంగా ప్రవర్తించారని, తండ్రితో పాటు అతడి స్నేహితుడు కూడా తమతో అసభ్యంగా ప్రవర్తించేవాడని వివరించారు. విషయం తెలుసుకున్న తల్లి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు, అతడి స్నేహితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. తండ్రిని రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న అతని స్నేహితుడి కోసం గాలిస్తున్నారు. తండ్రి పక్కనున్న సమయంలోనే అతడి స్నేహితుడు అసభ్యంగా ప్రవర్తించాడంటూ కుమార్తె గతంలోనే జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇదీ చూడండి: EarthQuake : 2 సెకన్ల పాటు భూప్రకంపనలు.. ఇళ్లలోంచి పరుగులు తీసిన ప్రజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.