Farmer Suicide in mulugu: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం శివపురంలో విషాదం చోటుచేసుకుంది. ధాన్యం కొనుగోలులో జరుగుతున్న ఆలస్యం మరో రైతును బలితీసుకుంది. ఓవైపు మొలకెత్తుతోన్న ధాన్యం.. మరోవైపు కొనుగోలులో అలసత్వం.. ఇంకోవైపు పెరుగుతున్న అప్పులు.. ఇలా వెంటాడుతున్న బాధలతో తీవ్ర మనస్థాపానికి గురైన రైతు.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పండించిన ధాన్యం కుప్పల వద్దే ప్రాణాలొదిలాడు.
పోసిన కుప్పలు పోసినట్టుగానే..
Paddy Procurement in telangana: శివపూర్ గ్రామానికి చెందిన కుమార్ అనే రైతు 7 ఎకరాల్లో వరి సాగు చేశాడు. వరి కోసే యంత్రంతో రెండు ఎకరాలు పంట కోశాడు. కోసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పోశాడు. ఆ ధాన్యం అమ్మి వచ్చిన డబ్బుతో.. ఇంకో ఐదు ఎకరాల్లోని పంటను కోయాలనుకున్నాడు. కానీ.. కొనుగోలు కేంద్రంలో పోసిన కుప్పలు కుప్పలుగానే ఉంటున్నాయి. పొలంలోని పంట సరైన సమయానికి కోయక.. రాలిపోతోంది. ఇవన్నీ కుమార్ మనసును తొలిచేస్తున్నాయి.
తీవ్ర మనస్థాపంతో..
ఓవైపు పంట కోసేందుకు చేతిలో డబ్బులు లేవు.. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం అమ్ముడు పోవటం లేదు.. పెట్టుబడి పెట్టిన పైసలకు రోజురోజుకి వడ్డీ పెరిగిపోతోంది. వీటన్నింటితో.. తీవ్ర మనస్తాపానికి గురై ధాన్యపు రాశి వద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కుమార్ను హుటాహుటిన వరంగల్ ఎంజీఎంకు తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే మృతి చెందాడు.
ఇవీ చూడండి: