family suiside in nizamabad: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కుటుంబం ఆత్మహత్య కలకలం రేపుతోంది. నగరంలోని ఒక హోటల్ లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆదిలాబాద్ కు చెందిన కొత్తకోట సూర్యప్రకాశ్ అనే వ్యక్తి... రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. భార్య ప్రత్యూష, ఇద్దరు పిల్లలు ప్రత్యూష, అద్వైత్లతో... 15 రోజులుగా నిజామాబాద్‌లోని కపిల హోటల్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇవాళ నలుగురు హోటల్ గదిలో విగతజీవులుగా కనిపించారు.
భార్య, పిల్లలు పురుగుల మందు తాగి చనిపోగా.... సూర్యప్రకాశ్ ఉరివేసుకుని చనిపోయాడు. మొదట భార్య, పిల్లలకు పురుగుల మందు తాగించిన సూర్యప్రకాశ్... అనంతరం తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆదిలాబాద్‌కి చెందిన సూర్య ప్రకాష్ కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. 15 రోజుల కింద నిజామాబాద్‌కు వచ్చి కపిల హోటల్లో కుటుంబంతో పాటు ఉంటున్నాడు.
వ్యాపారంలో నష్టాలు, ఆప్పులిచ్చిన వారి వేధింపులు భరించలేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో తనను డబ్బుల కోసం వేధించిన ముగ్గురి పేర్లను రాసినట్టు తెలిసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వచ్చిన నష్టాలు, పెట్టుబడులు పెట్టిన వారి నుంచి డబ్బులు కోసం ఒత్తిడి కారణంగా చనిపోతున్నట్టు సూసైడ్ నోట్లో పేర్కొన్నారని పోలీసులు చెబుతున్నారు. సూసైడ్ నోట్ ఆధారంగా బంధువుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తామని ఏసీపీ వేంకటేశ్వర్ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
నలుగురు కుటుంబసభ్యులు నిన్న రాత్రి హోటల్లో ఆత్మహత్య చేసుకున్నారు. సూర్యప్రకాశ్ సూసైడ్ నోట్ రాయటం జరిగింది. రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో భాగస్వాములు, అప్పు ఇచ్చిన వారు వేధించడం వల్ల వారికి కొంత ప్రాపర్టీలు రాయించి ఇవ్వడం జరిగింది. అయినా కూడా వేధింపులు ఆపకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్లో రాశాడు. దీని ఆధారంగా దర్యాప్తు జరుపుతాం. సూసైడ్ నోట్లోని వారి గురించి విచారణ జరుపుతాం- వేంకటేశ్వర్, ఏసీపీ నిజామాబాద్
ఇవీ చదవండి:
నగరంలో మరోసారి ఫ్లెక్సీ వార్, అమిత్‌షా రాక ముందు కాక
మద్యం స్కాంలో సిసోదియాకు లుక్ఔట్ నోటీసులు, సవాల్ విసిరిన మంత్రి