Fake CBCID officer arrest in Hyderabad : సీబీసీఐడీ అధికారినంటూ బురిడీ కొట్టిస్తున్న మాయగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జి.శ్రీనివాసు(46) భువనేశ్వర్‌లోని సీటీసీసీ ఉద్యోగి. మణికొండలో ఉంటున్నాడు. వివిధ నగరాలు చుట్టొచ్చేందుకు.. సీబీసీఐడీ అధికారినంటూ అద్దెకార్లను బుక్ చేసుకునేవాడు. ఆ ప్రాంతాలకు చేరగానే సీబీసీఐడీ అధికారినంటూ నమ్మించి, కారు అద్దె ప్రభుత్వం చెల్లిస్తుందంటూ డ్రైవర్లకు టోకరావేసి మాయమయ్యేవాడు. గతనెల 29న నిందితుడు ఓ కారులో 4రోజులు బెంగళూరు, మైసూరు చుట్టొచ్చాడు.
అద్దె రూ.51,000 ప్రభుత్వం చెల్లిస్తుందని డ్రైవర్ భానునాయక్‌తో చెప్పి మాయమయ్యాడు. బాధితుడి ఫిర్యాదుతో ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే తరహాలో ఈనెల 15న బేగంపేట్‌లోని హోటల్ నుంచి మరో కారులో వివిధ ప్రాంతాలు చుట్టొచ్చాడు. ఉబర్ కారు సర్వీసు నిర్వాహకులు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. టాస్క్‌ఫోర్స్ ఓఎస్‌డీ రాధాకిషన్‌రావు సారథ్యంలో ఉత్తరమండలం ఇన్‌స్పెక్టర్ టి.శ్రీనాథ్‌రెడ్డి, ఎస్సైలు కె.శ్రీకాంత్, ఎం.అనంతచారి, బి.అరవింద్‌గౌడ్, బి.అశోక్‌రెడ్డి బృందం ముమ్మరంగా గాలించి మంగళవారం నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఇవీ చదవండి: