మెదక్ జిల్లా శివ్వంపేట మండలం అల్లీపూర్లో అగ్ని ప్రమాదం జరిగింది. సర్పంచ్ పిట్ల సుగుణ ఇంట్లో.. ఒక్కసారిగా మంటలు చెలరేగడం వల్ల స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
ఈ ఘటనలో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. పెను ప్రమాదం తప్పడం వల్ల స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనకు గల కారణాలను అధికారులు ఆరా తీస్తున్నారు.
ఇదీ చదవండి: అడ్డు వస్తున్నాడని పసివాడి ప్రాణాలు తీశాడు