ETV Bharat / crime

అనుమానాస్పద మృతి కేసును ఛేదించిన పోలీసులు - medchal district crime news

ఇద్దరు కాపలాదారులు కలిసి ఓ వ్యక్తిని చితకబాదారు. ఆ దెబ్బలు తాళలేక బాధితుడు మృతి చెందడంతో గుట్టుచప్పుడు కాకుండా పక్కనే ఉన్న చెరువులో పడేశారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు చివరికి కేసును ఛేదించారు.

అనుమానాస్పద మృతి కేసు ఛేదన
అనుమానాస్పద మృతి కేసు ఛేదన
author img

By

Published : Apr 23, 2021, 11:00 PM IST

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మల్లంపేటలోని డ్రీమ్ వ్యాలీలో ఈనెల 18న అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సురేశ్‌ అనే వ్యక్తి కేసును పోలీసులు ఛేదించారు. నిందితులు రజాక్‌, శ్రీనివాస్‌లుగా గుర్తించారు.

రజాక్, శ్రీనివాస్‌లు డ్రీమ్‌వ్యాలీలో కాపలాదారులుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈనెల 18న రాత్రి విధులు నిర్వహిస్తుండగా స్థానిక నివాసి సురేశ్‌ ఇనుప నిచ్చెన తీసుకుని వెళ్తుండగా అడ్డుకున్నారు. నిచ్చెన ఎక్కడ నుంచి తీసుకెళ్తున్నావని ప్రశ్నించగా.. అతను తడబడ్డాడు. దీంతో దొంగతనం చేసి ఉంటాడని భావించి అతన్ని చితకబాదారు. అనంతరం ఎక్కడ పనిచేస్తావు అని అడగ్గా వెంకటయ్య అనే మేస్త్రీ వద్ద పని చేస్తానని చెప్పడంతో అర్ధరాత్రి 3 గంటల సమయంలో వెంకటయ్యకు ఫోన్ చేశారు. సురేశ్‌ గురించి వాకబు చేయగా.. గతంలో తన వద్ద పనిచేసేవాడని బదులిచ్చాడు. ఫలితంగా సురేశ్‌ను అక్కడే వదిలేసి వారు గస్తీకి వెళ్లారు. తిరిగి వచ్చి చూసేసరికి అతను రోడ్డుపై విగతజీవిగా పడి ఉన్నాడు.

తాము కొట్టిన దెబ్బలకే మృతిచెంది ఉంటాడని భావించిన వారు.. గుట్టుచప్పుడు కాకుండా సురేశ్‌ మృతదేహాన్ని సమీపంలో ఉన్న కత్వా చెరువులో పడేశారు. మరుసటిరోజు పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు. మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతుడి జేబులో దొరికిన వెంకటయ్య ఫోన్ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టగా.. హత్యగా తేలింది. ఈ మేరకు నిందితులు రజాక్, శ్రీనివాస్‌లను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

ఇదీ చూడండి: ప్రమాదవశాత్తు నీటమునిగి యువకుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.