Road Accident: హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయ సమీపంలో ప్రధాన రహదారిపై తెల్లవారుజామున కారు ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం సేవించి వాహనం నడిపి డివైడర్‌ను ఢీకొట్టాడు. ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో అతను స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కారు ముందు భాగం దెబ్బతింది. ఆ సమయంలో రహదారిపై ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. డ్రైవర్ బానోతు చందును జూబ్లీహిల్స్ పోలీసులు శ్వాస విశ్లేషణ పరీక్షలు నిర్వహించగా ఆల్కహాల్ శాతం 111 పాయింట్లు ఉన్నట్లు నిర్ధారించారు. అనంతరం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
ఇవీ చదవండి: ఖమ్మం జిల్లాలో విషాదం.. ముగ్గురు మృతి