ETV Bharat / crime

రూట్ మార్చిన డ్రగ్ డీలర్లు.. మొన్నటిదాకా సౌత్.. ఇవాళ నార్త్​పై ఫోకస్​ - drug cases in hyd

Drug mafia in Hyderabad: హైదరాబాద్​లో డ్రగ్స్ సరఫరా, వినియోగం రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మొన్నటిదాకా సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​, జూబ్లీ హిల్స్ బస్​ స్టేషన్​ తదితర ప్రాంతాల్లో దందా కొనసాగించిన స్మగ్లర్లు హైదరాబాద్​లోని​ ఇప్పుడు రూట్ మార్చి నగరంలోని ఉత్తర ప్రాంతాలపై ఫోకస్ చేస్తున్నారు. ఇరుకుగా ఉన్న నివాసాలు వారు డ్రగ్స్ కేంద్రాలుగా మార్చుకుంటున్నారు. సామాన్య జనంలా ప్రవర్తిస్తూ..గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్ సరఫరా చేస్తున్నారు.

Drug mafia
డ్రగ్స్ మాఫియా
author img

By

Published : Jan 28, 2023, 7:32 AM IST

Drug mafia in Hyderabad: మత్తుమాఫియా, హవాలా తరలింపు ముఠాలు దిశ మార్చుకున్నాయి. కొద్దికాలం క్రితం వరకు దక్షిణ మండలంలో పాగా వేసిన నేరస్థులు ఉత్తరంవైపు చేరుతున్నారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌, జూబ్లీ బస్‌స్టేషన్‌ ద్వారా రాకపోకలకు అనువుగా ఉండటంతో అడ్డాగా మలచుకుంటున్నారు. అధికశాతం నిందితులు ఇక్కడే చిక్కడం అందుకు నిదర్శనం.

బేగంపేట విమానాశ్రయంలోని కొరియర్‌ సంస్థలు కేంద్రంగా అంతర్జాతీయ డ్రగ్‌ ముఠా దందా చేసింది. డిసెంబరులో రూ.3.1కోట్ల విలువైన సూడోఎఫిడ్రిన్‌ స్వాధీనం చేసుకున్నారు. రెండేళ్లలో ఈ ముఠా ఇక్కడి నుంచే 100 కిలోల మత్తుపదార్థాలు విదేశాలకు చేరవేసినట్టు గుర్తించారు. ఇటీవల పాతబస్తీకి చెందిన చైన్‌స్నాచర్లు లంబా, జబా అనే పాత నేరస్థులతో కలిసి సికింద్రాబాద్‌ పాట్‌మార్కెట్‌ నుంచి బంగారు దుకాణాలకు పంపే వజ్రాలు, వెండి, బంగారు ఆభరణాలను దోచుకొని బీభత్సం సృష్టించారు. తాజాగా అదేచోట ఒక భవనంలో అగ్నిప్రమాదంలో రూ.5కోట్ల హవాలా సొమ్ము బూడిదైనట్టు సమాచారం.

నిఘా, తనిఖీలతో మారిన రూట్‌: రెండేళ్ల క్రితం వరకు బేగంబజార్‌, ఘాన్సీబజార్‌, గోషామహల్‌, బహదూర్‌పుర, చార్మినార్‌, మదీనా హవాలా, అక్రమ బంగారం తరలింపు కేంద్రాలుగా ఉండేవి. ఆధిపత్య పోరులో ముఠాల మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. పోలీసుల నిఘా, తనిఖీలు పెరగటంతో ముఠాలు రాణిగంజ్‌, జనరల్‌బజార్‌, పాట్‌మార్కెట్‌, తిరుమలగిరి, బేగంపేటవైపు మళ్లాయి.

ఇరుకు వీధులు.. రహస్య కేంద్రాలు.. గతేడాది మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో సుమారు రూ.50-60కోట్ల మేర హవాలా సొమ్ము స్వాధీనం చేసుకున్నారు. వీటిలో అధికశాతం ఫార్మా, స్థిరాస్తి, గుట్కా వ్యాపారుల సొమ్ముగా గుర్తించారు. తాజాగా బేగంపేట్‌ పోలీసులు రూ.4కోట్లు తరలిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఉత్తర మండల పరిధిలో వ్యాపార, వాణిజ్య ప్రాంతాల్లో కొందరు హవాలా దందా నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఇరుకువీధుల్లో అపార్ట్‌మెంట్స్‌, పాత భవనాలను నగదు నిల్వ కేంద్రాలుగా మార్చారు. పోలీసులు గుర్తించి వచ్చేలోపు మరో చోటికి పంపేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

రైల్వే స్టేషన్‌లో మకాం: కరడుగట్టిన నేరస్తులు, పిక్‌పాకెటర్లు, అంతరాష్ట్ర ముఠాలు, గొలుసుదొంగలు, మాదకద్రవ్యాల ముఠాలు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ను షెల్టర్‌జోన్‌గా మార్చుకున్నాయి. హోటళ్లు, లాడ్జీల్లో బసకు ఆధార్‌ తప్పనిసరి చేయటంతో రూటు మార్చారు.

  • నగరు శివారు ప్రాంతాల్లో నేరాలకు పాల్పడిన వీరంతా రైల్వేస్టేషన్‌కు చేరుతున్నారు. సొంతూళ్లకు చేరేందుకు రైలెక్కుతున్నారు. లేదంటే ప్రయాణికుల ప్రాంగణాలు, వాహనాలు నిలిపే ప్రాంతాల్లో ప్రయాణికుల మాదిరిగా తలదాచుకుంటున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.