ETV Bharat / crime

మహిళా ఉద్యోగి పట్ల ఆసుపత్రి డైెరెక్టర్ లైంగిక వేధింపులు.. ఏంటని నిలదీస్తే..! - ప్రైవేటు ఆసుపత్రిలో లైంగిక వేధింపులు

Sexual Harassment in Private Hospital: ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రి డైరెక్టర్​గా ఉద్యోగ బాధ్యతలు చేపడుతున్నాడు. తన మంచి తనంతో పది మందికి ఉపాధి కల్పించాల్సినవాడు.. వక్రబుద్ధితో ఆసుపత్రిలో పనిచేసే మహిళా ఉద్యోగిని వేధించాడు. ఆ ప్రబుద్ధుడి భార్య అదే ఆసుపత్రిలో డాక్టర్​గా పనిచేస్తోంది. ఈ వ్యవహారం గురించి నిలదీస్తే అతడి భార్యే.. ఆ మహిళా ఉద్యోగిపై దాడికి పాల్పడిన ఘటన మేడ్చల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Sexual Harassment
Sexual Harassment
author img

By

Published : Nov 23, 2022, 7:35 PM IST

Updated : Nov 23, 2022, 8:25 PM IST

Sexual Harassment in Private Hospital: మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలంటారు. అలా వారు ఎదో ఒక పని చేస్తూ తాము ఎవరికీ తక్కువ కాదని నిరూపించుకుందామంటే.. వారి అడుగలకు అడ్డుగా నిలుస్తూ వేధిస్తున్నారు కొందరు కామాంధులు. తాజాగా ఓ వ్యక్తి మేడ్చల్ జిల్లాలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి డైరెక్టర్​గా వ్యవహరిస్తూ.. అందులో పనిచేసే మహిళా ఉద్యోగిని లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాలలోకి వెళితే.. మేడ్చల్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో స్వప్న అనే మహిళ మేనేజర్​గా పని చేస్తుంది. రోజు విధులకు హాజరవుతూ తన పనిని సక్రమంగా నిర్వహిస్తుంది. కానీ అదే ఆసుపత్రి డైరెక్టర్​గా వ్యవహరిస్తున్న రవి.. ఆమె పట్ల ఆసభ్యంగా ప్రవర్తించడం మొదలెట్టాడు. రోజురోజుకి ఆ కామాంధుడి ఆగడాలు మితిమీరడంతో ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంది. దాంతో ఇవాళ ఆసుపత్రికి వచ్చిన డైరెక్టర్​ రవిని తన బంధువులతో కలిసి నిలదీసిన బాధిత మహిళా ఉద్యోగి ఆందోళనకు దిగారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆ ప్రబుద్ధుడి భార్య అదే ఆసుపత్రిలో డాక్టర్​గా విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో స్వప్న తనను ఎందుకు వేధిస్తున్నావని రవిని నిలదీయగా అతని భార్య మధ్యలో తలదూర్చడంతో కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. తప్పంతా బాధితురాలిదే అంటూ.. ఆమెపై దాడికి పాల్పడింది.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి దగ్గర నుంచి అధిక మొత్తంలో బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేసేవారని స్వప్న ఆరోపించారు. తనను అలాగే చేయాలని ఒత్తిడి తెచ్చేవాడని ఆమె పేర్కొన్నారు. ఆయన భార్య ఇంట్లో లేని సమయంలో ఇంటికి రమ్మని ఫోన్ చేసి వేధించేవాడని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే రెండు నెలలుగా అసభ్యకరంగా మెసేజ్​లు పెట్టి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. తనను లైంగికంగా వేధించిన ఆసుపత్రి డైరెక్టర్ రవిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

మహిళా ఉద్యోగి పట్ల ఆసుపత్రి డైెరెక్టర్ లైంగిక వేధింపులు.. ఏంటని నిలదీస్తే..!

ఇవీ చదవండి:

Last Updated : Nov 23, 2022, 8:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.