ETV Bharat / crime

భార్యను సజీవదహనం చేసిన వ్యక్తికి ఉరిశిక్ష - విజయవాడలో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త వార్తలు

భార్య గర్భవతి అని జాలి లేకుండా సజీవదహనం చేసిన నిందితునికి మహిళా సెషన్స్ కోర్టు ఉరిశిక్ష విధించింది. నిందితుడు నంబియార్​కు నేడు ఉరిశిక్ష వేస్తూ తీర్పు వచ్చింది.

death
ఉరిశిక్ష
author img

By

Published : Apr 8, 2021, 10:56 PM IST

భార్య గర్భవతి అని జాలి లేకుండా సజీవదహనం చేసిన నిందితునికి మహిళా సెషన్స్ కోర్టు ఉరిశిక్ష విధించింది. శైలజ, నంబియార్​కు 2018 లో వీరికి వివాహమైంది. ఏపీ విజయవాడ కృష్ణలంక పరిధిలో దంపతులు నివసించేవారు. నంబియార్ ఓ ప్రైవేట్ కాలేజీలో టీచర్​గా పని చేస్తున్నానని పెళ్లికి ముందు శైలజకు చెప్పాడు.

పెళ్లి అనంతరం ఉద్యోగాన్ని మానేశాడు. శైలజ తండ్రి తహసీల్దార్ కార్యాలయంలో అటెండర్​గా ఉద్యోగం చేస్తున్నాడు. తండ్రి నుంచి నగదు తీసుకురావాలని భార్యపై ఒత్తిడి తెచ్చేవాడు నంబియార్​. పెళ్లైన కొద్ది రోజులకే అదనపు కట్నం కోసం భార్యను వేధించేవాడు.

డబ్బులు ఇవ్వకపోవటంతో 2019లో.. ఓ రోజు పథకం ప్రకారం నిద్రిస్తున్న భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో శైలజ మృతి చెందింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. విజయవాడ మహిళా సెషన్స్ కోర్టులో విచారణ జరిగింది. నిందితుడు నంబియార్​కు నేడు ఉరిశిక్ష వేస్తూ తీర్పు వచ్చింది.

ఇదీ చదవండి: రూ.2వేల కోట్లతో విద్యాపథకం: మంత్రివర్గ ఉపసంఘం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.