DCM van accident: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్, లింగగిరి రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. ట్రాలీ ఆటోను ట్రాక్టర్ ఢీ కొట్టింది. దీంతో రోడ్డు పక్కనే ఉన్న చిన్న హోటల్ బయట ఉన్న కాగుతున్న నూనె కడాయికి రాసుకుంటూ వెళ్లిన ట్రాలీ రెండు బైక్లను ధ్వంసం చేసింది. ఈ ప్రమాదంలో ఇద్దరి గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. లింగగిరి రోడ్డు మార్గంలో ట్రాలీ ఆటో వెళుతుంది. ట్రాక్టర్ వచ్చి ఈ వాహనాన్ని ఢీ కొట్టడంతో రోడ్డు పక్కనే ఉన్న చిన్న హోటల్లో కాగుతున్న నూనె గ్యాస్ పొయ్యిను రాసుకుంటూ వెళ్లడంతో నూనె కిందపడి మంటలు వ్యాపించాయి. వెంటనే స్పందించిన హోటల్ యజమాని మంటలు ఆర్పడంతో పెనుప్రమాదమే తప్పింది. హోటల్ పక్కనుంచి వెళ్లి ఎదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. వీరికి స్వల్ప గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. రహదారి టర్నింగ్లో హోటల్లో ఉండటం వలనే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.

ఇవీ చదవండి: