ETV Bharat / crime

Cyber Criminals Robbed: సైబర్​ నేరగాళ్ల మాయ.. మహేశ్​ బ్యాంకులో రూ. 12 కోట్ల లూటీ - Cyber attack on mahesh bank

MAHESH BANK
MAHESH BANK
author img

By

Published : Jan 24, 2022, 6:47 PM IST

Updated : Jan 24, 2022, 7:42 PM IST

18:24 January 24

మహేశ్‌ బ్యాంకు సర్వర్‌ హ్యాక్‌ చేసి రూ.12 కోట్లు కాజేసిన సైబర్‌ మోసగాళ్లు

Cyber Criminals Robbed: సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. ఇన్నాళ్లు అమాయక ప్రజలే లక్ష్యంగా లూటీ చేసిన సైబర్ కేటుగాళ్లు... మరింత రెచ్చిపోతున్నారు. ప్రజలు సొమ్ము దాచుకునే బ్యాంకులను ఇప్పుడు లక్ష్యంగా చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ మహేశ్​ కో-ఆపరేటివ్ బ్యాంక్​పై దాడి చేశారు. బ్యాంక్ మెయిన్ సర్వర్​ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు... ఏకంగా రూ. 12 కోట్లు మాయం చేశారు. అక్కడితో ఆగకుండా తెలివిగా కాజేసిన సొమ్ము రూ. 12 కోట్లను వెంటనే వేరు వేరు బ్యాంకుల్లోని 100 అకౌంట్లకు ట్రాన్స్​ఫర్ చేశారు.

తమ బ్యాంకు సర్వర్​ హ్యాక్ అయిందని తెలుసుకున్న మహేశ్​ బ్యాంక్ యాజమాన్యం సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. సుమారు రూ. 12 కోట్లు మాయమైనట్లు ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... సినీఫక్కీలో జరిగిన సైబర్ హ్యాక్​ను ఛేదించే పనిలో పడ్డారు. ఏకంగా బ్యాంక్ సర్వర్​లోకి చొరబడి భారీస్థాయిలో సొమ్మును కాజేసిన సైబర్ నేరగాళ్ల ఆట కట్టించాలని బ్యాంక్ అధికారులు కోరుతున్నారు.

Cyber Crime: సైబర్ నేరగాళ్లు... ఈ మధ్య కాలంలో పలు రకాలుగా ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఆఫర్లు అంటూ, ఓటీపీలంటూ, కస్టమర్ కేర్ అధికారులమంటూ, కేవైసీ అప్డేట్ అంటూ ఇలా వారికి ఏ ఐడియా వస్తే అలా అమాయకులే లక్ష్యంగా అందినకాడికి దోచేస్తున్నారు. హనీ ట్రాప్ ఈమధ్య బాగా ప్రాచూర్యంలోకి వచ్చింది. అందమైన యువతులను వలగా వేసి సర్వం ఊడ్చేస్తున్నారు. ప్రజలే కాకుండా పలు సంస్థలు, బ్యాంకులపై కూడా సైబర్ కేటుగాళ్ల కన్నుపడింది. తాజాగా మహేశ్ బ్యాంక్ ఉదంతం ఇందుకు నిదర్శనం.

ఇదీచూడండి: గంటకు రూ.రెండున్నర లక్షలు.. రోజుకు రూ.అర కోటిపైనే..

Last Updated : Jan 24, 2022, 7:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.