ETV Bharat / crime

రూ. 2 స్కాన్ చేస్తే రూ. 4 వస్తే.. రూ. 77వేలు స్కాన్ చేస్తే?

సైబర్ నేరగాళ్లు పేట్రేగిపోతున్నారు. వివిధ మార్గాల్లో అమాయకులకు గాలం వేస్తూ... వేల రూపాయలు కాజేస్తున్నారు. అమాయకత్వమే పెట్టుబడిగా చెలరేగిపోతున్నారు. మొదట కేటుగాళ్లను నమ్మి తర్వాత మోసపోయామని తెలుసుకుని బాధితులు లబోదిబోమంటున్నారు.

రూ. 2 స్కాన్ చేస్తే రూ. 4 వస్తే.. రూ. 77వేలు స్కాన్ చేస్తే?
రూ. 2 స్కాన్ చేస్తే రూ. 4 వస్తే.. రూ. 77వేలు స్కాన్ చేస్తే?
author img

By

Published : Feb 7, 2021, 4:23 PM IST

నగరంలో రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఓ వ్యక్తిని నమ్మి ఏకంగా రూ. 77 వేలు మోసపోయింది ఓ మహిళ. మేడ్చల్ సైబరాబాద్ జీడిమెట్ల పరిధి చింతల్​కు చెందిన ఓ మహిళ... గాజుల వ్యాపారం నిర్వహిస్తోంది. వీటికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతోంది. ఫేస్​బుక్​లో మోనో షైనీ అనే అకౌంట్ హోల్డర్ సదురు మహిళకు ఫోన్ చేసి తనకు పది జతల గాజులు కావాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు.

అందుకు సంబంధించి రూ. 6 వేలు మహిళకు పంపడానికి తాను పంపే క్యూఆర్ కోడ్​ను స్కాన్ చేయాలని కేటుగాడు తెలిపాడు. ఇదంతా నమ్మిన మహిళ... క్యూఆర్ కోడ్​ను స్కాన్ చేసి రూ. 2 పంపగా... తిరిగి రూ. 4 రాగా పూర్తిస్థాయిలో నమ్మింది. అలా నమ్మిన మహిళా వ్యాపారి సుమారు రూ. 77 వేలు పొగొట్టుకుంది. మోసపోయాయనని గ్రహించిన బాధితురాలు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

రూ. 2 స్కాన్ చేస్తే రూ. 4 వస్తే.. రూ. 77వేలు స్కాన్ చేస్తే?

ఇదీ చూడండి: లాటరీ, గిఫ్ట్​ల పేరుతో మోసం చేస్తున్న ముఠా అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.