cyber crime news: క్రెడిట్ కార్డుపై రివార్డ్ పాయింట్స్ పేరుతో అందినకాడికి దోచుకున్నారు.. సైబర్ నేరగాళ్లు. ఈ ఘటన హైదరాబాద్ బాలానగర్‌లో చోటుచేసుకొంది. ఐడీపీఎల్ చెందిన సుభాశ్‌కు ఓ ప్రైవేటు బ్యాంకులో క్రెడిట్ కార్డు ఉంది. ఇటీవల సుభాష్‌కు ఓ మెసెజ్ వచ్చింది. క్రెడిట్ కార్డుకు రివార్డు పాయింట్స్ వచ్చాయంటూ ఆ మెసెజ్‌లో ఓ లింక్ పంపారు. నిజమేనని నమ్మిన సుభాష్.. తన ఖాతాకు సంబంధించిన వివరాలు అందులో నమోదు చేశాడు.
రూ.1.11 లక్షలు కాజేత..
దీంతో వెంటనే ఆ ఖాతా నుంచి రూ.1.11 లక్షలు డెబిట్ అయ్యాయి. ఆ మేరకు సుభాష్‌కు మెసెజ్ వచ్చింది. కంగుతున్న బాధితుడు బాలానగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.... సైబర్ ఉచ్చుగా గుర్తించారు. వెంటనే దర్యాప్తు చేపట్టారు.
ఇదీచూడండి: