ETV Bharat / crime

cyber cheating cases in metro cities: ఇలా ఎరవేస్తున్నారు.. అలా దోచేస్తున్నారు.. - మెట్రో నగరాల్లో సైబర్​ మోసాలు

సులభంగా డబ్బు సంపాదించాలన్న (easy money) దురాలోచనతో సైబర్‌ నేరస్థులు (Cyber cheaters) సరికొత్త అంతర్జాల మోసాలకు తెరలేపారు... దిల్లీ.. నోయిడా కేంద్రంగా కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని (cyber cheating cases in metro cities).. బీమా పాలసీలు కట్టి మధ్యలో వదిలేసిన వారిని లక్ష్యంగా చేసుకుని రూ.లక్షల్లో కొల్లగొడుతున్నారు.

cyber
cyber
author img

By

Published : Sep 22, 2021, 9:12 AM IST

మెట్రో నగరాల్లో (cyber cases in metro cities) సైబర్‌ నేరస్థులు (Cyber cheaters) సరికొత్త అంతర్జాల మోసాలకు (cyber crime) తెరలేపారు. సంస్థలు, వ్యక్తులకు ఫోన్లు చేస్తున్నారు. స్పందించిన వారికి రూ.కోట్ల నగదు మీకు వస్తుందంటూ నమ్మిస్తున్నారు. పాతబస్తీలో ఉంటున్న వ్యాపారి నుంచి కొద్దినెలల క్రితం రూ.1.02 కోట్లు దోచుకున్నారు. బాధితుల ఫిర్యాదుల ఆధారంగా సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇలా ఎర వేస్తున్నారు..

* జీవిత బీమా సంస్థ, ఇతర ప్రైవేటు, కార్పొరేటు సంస్థలకు చెందిన కొత్త, పాత బీమా పాలసీల (insurance policies) వివరాలను సైబర్‌ నేరస్థులు సేకరిస్తున్నారు. పదేళ్ల క్రితం నుంచి ప్రీమియం చెల్లించకుండా వదిలేసిన వారిని ఎంపిక చేసుకుంటున్నారు.
* బీమా సంస్థల అధికారులుగా పరిచయం చేసుకుని ప్రీమియం చెల్లించకపోయినా సరే... బీమా సంస్థలు గడువు పూర్తైన వాటికి నగదు చెల్లిస్తోందని.. ఇందుకోసం కొంత మొత్తం చెల్లిస్తే సరిపోతుందని వివరిస్తున్నారు.
* పాలసీ రూ.లక్షల్లో ఉన్నా... బీమా కంపెనీలు మాత్రం రూ.కోట్లలో నగదు ఇస్తున్నాయని.. ప్రైవేటు, కార్పొరేటు బీమా సంస్థల మధ్య పోటీ పెరగడంతో పాత పాలసీదారుల నమ్మకాన్ని పొందేందుకు వారి ద్వారా మరిన్ని పాలసీలు వస్తాయన్న అంచనాతో ఇదంతా చేస్తున్నట్లు చెబుతున్నారు.
* బాధితులు తమ మాటలను నమ్మారని తెలుసుకున్న వెంటనే మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. తొలుత రూ.10 వేలతో ప్రారంభించి తర్వాత క్రమంగా మొత్తాన్ని పెంచుకుంటూ వెళుతున్నారు.
* హైదరాబాద్‌, బెంగళూరు, విజయవాడ, మైసూర్‌, మధురై, తిరుపతి, వైజాగ్‌ నగరాల్లో ఉంటున్న వారిని సైబర్‌ నేరస్థులు సులువుగా మోసం చేస్తున్నారు. ఆయా నగరాలకు చెందిన వారి నుంచే రూ.కోట్లు కొల్లగొట్టారు.

మూడు నెలల్లో రూ.15కోట్లు

బీమా పాలసీలకు రూ.కోట్లు ఇస్తాం అంటూ మోసాలకు పాల్పడుతున్న సైబర్‌ నేరస్థులు దిల్లీలో పదుల సంఖ్యలో ఉన్నారని పోలీసులు గుర్తించారు. కరోనా ప్రభావంతో కొద్దిరోజులు కార్యకలాపాలు నిలిపేసినా.. రెండోదశ తర్వాత మూడు నెలల్లోనే వీరు మెట్రో నగరాల్లోని బాధితుల నుంచి రూ.15 కోట్లు కొల్లగొట్టారని పోలీసులు తెలిపారు.

ముందుగానే ఆదాయ పన్ను చెల్లించాలని, కస్టమ్‌ సుంకం కట్టాలని, ఐఆర్‌డీఏ (బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ)కు చెల్లించాలంటూ ఒకదాని తర్వాత మరో కారణం చెబుతున్నారు. బాధితులకు అనుమానం రాకుండా బీమా సంస్థ జారీ చేసినట్టు నకిలీ చెక్కులను వాట్సాప్‌ ద్వారా పంపిస్తున్నారు.

నకిలీ పత్రాలు.. గాల్లో ‘ప్రాణాలు’.. వాహనాల ఫిట్‌నెస్‌ కోసం అడ్డదారులు (vehicle fitness)

పాఠశాలలు తెరుచుకుని.. క్రమంగా విద్యార్థులు హాజరుశాతం పెరుగుతోంది. దీంతో పాఠశాల బస్సులు, వ్యాన్లు, ఆటోలు రోడ్డెక్కుతున్నాయి. ఏడాదిన్నరగా విద్యాసంస్థలు బంద్‌ కావడంతో పాఠశాల వ్యానులు, బస్సులు, ఆటోలు ఎలాంటి ఫిట్‌నెస్‌ లేకుండా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఫిట్‌నెస్‌ పత్రాలు తీసుకుంటున్నారు. బీమా ఉంటేనే ఫిట్‌నెస్‌ చేస్తుండడంతో నకిలీ బీమా ధ్రువపత్రాలకు డిమాండ్‌ పెరిగింది. ఒక్కో వాహనానికి రూ.5-7వేల వరకు ఖర్చవుతుండటంతో చాలామంది అడ్డదారుల్లో నకిలీ బీమా పత్రాలు తీసుకొస్తున్నారు. పాత బస్తీలోని పలు ఆర్టీఏ కార్యాలయాల కేంద్రంగా ఈ దందా నడుస్తోంది. గతంలో ఈ తంతుపై ‘ఈనాడు’లో కథనాలు రావడంతో ట్రాన్స్‌పోర్టు పోలీసులు తనిఖీలు చేసి దళారులను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత పరిస్థితి మళ్లీ మామూలుగా మారింది. మెహిదీపట్నం, బండ్లగూడ, ఉప్పల్‌, మేడ్చల్‌ ఇలా అన్ని చోట్ల యథేచ్ఛగా దందా నడుస్తోంది.

* ఆటో నుంచి మినీవాహనానికి రూ.6-7వేల వరకు ప్రీమియం చెల్లించి బీమా పొందాలి. దీన్ని తప్పించుకోవడానికి కొందరు డ్రైవర్లు అడ్డదారుల్లో వెళుతున్నారు. నకిలీ బీమాపత్రాలను ఫిట్‌నెస్‌ సందర్భంలో అందిస్తున్నారు.నకిలీ బీమాపత్రాలను నమోదుచేయడానికి అక్కడా రూ.2వేల వరకు వసూలుచేస్తున్నారు. ఇలా రూ.2200-2500లోపే ఫిట్‌నెస్‌ సులువుగా పొందుతున్నారు.

* మార్కెట్‌లో అనేక బీమా కంపెనీలు వాహన బీమా పాలసీలు విక్రయిస్తున్నాయి. ఇవి ఇన్సూరెన్సు రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(ఐఆర్‌డీఏ) పరిధిలో పనిచేస్తుంటాయి. ఏదీ నకిలీది? ఏది నిజమైంది? అనేది పరిశీలించేందుకు రవాణాశాఖ వద్ద పక్కా వ్యవస్థ లేదు.

సీఎం హెల్త్‌ రీఫండ్‌.. డబ్బులొచ్చాయ్‌!..

మీకు రేషన్‌ కార్డు లేదా..? ఇప్పించే బాధ్యత మాది.. మీరు ఆసుపత్రుల్లో చేరి చికిత్స తీసుకున్నారా..? ఆ డబ్బును తిరిగి చెల్లిస్తామంటూ.. ‘సీఎం హెల్త్‌ రీఫండ్‌’ (cm relief fund) డిపార్టుమెంట్‌ నుంచి మాట్లాడుతున్నామని.. మాయ మాటలు చెప్పి.. అమాయకుల్ని నిండా ముంచేస్తున్న వైనం తాజాగా వెలుగు చూసింది. ఈ తరహాలోనే రూ.1.2 లక్షలు కోల్పోయిన ఓ బాధితుడు రాచకొండ సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించాడు.

రూ. 35వేలు మంజూరయ్యాయి..

షాపింగ్‌ మాల్స్‌కి వెళ్లినప్పుడు.. ఇతర చోట్ల లక్కీ డిప్‌ అనగానే సదరు వ్యక్తులిచ్చే కార్డులపై మన వివరాలు రాసి ఇస్తుంటాం. ఇదే ఇప్పుడు కేటుగాళ్లకు వరంగా మారింది. సదరు వ్యక్తులు/సంస్థలు మన సమాచారాన్ని ఎవరికి కావాలంటే వాళ్లకు విక్రయిస్తున్నారు. ఇలా సేకరించిన నంబర్లకు మోసగాళ్లు ఫోన్‌ చేసి వివిధ ప్రభుత్వ విభాగాల పేరు చెప్పి బోల్తా కొట్టిస్తున్నారు. తాజా కేసులో ‘సీఎం హెల్త్‌ రీఫండ్‌’ పేరిట రూ.35వేలు మంజూరైనట్లు చెప్పడంతో బాధితుడు సంతోషపడ్డాడు. అతని ఖాతాలో డబ్బుల్లేకపోవడంతో.. ఫోన్‌పే అకౌంట్‌ ఉన్న అతని స్నేహితులు నంబర్లు(ఒకరు మేస్త్రీ, మరొకరు కానిస్టేబుల్‌) తీసుకున్నారు. ఆ ఇద్దరికి కేటుగాళ్లు వేర్వేరుగా ఫోన్లు చేశారు. వేరే వారి ఖాతాలో పడాల్సిన ‘సీఎం హెల్త్‌ రీఫండ్‌’ డబ్బులు.. మీ మిత్రుడి ఖాతాలో తప్పుగా జమయినట్లు తెలిపారు. ఇప్పటికిప్పుడు చెల్లించకపోతే జైలుకెళ్లడం ఖాయమని హెచ్చరించారు. నిజమే అనుకుని ఆ ఇద్దరు స్నేహితులు రూ.1.02 లక్షలు.. కేటుగాళ్లు సూచించిన ఫోన్‌ పే నంబర్‌కు బదిలీ చేశారు. తర్వాత బాధితుడికి ఈ విషయం చెప్పారు. అప్పుడు అసలు విషయం తెలిసి.. మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ చూడండి: Cyber Crime: తక్కువ ధరకే ప్లాట్‌ విక్రయం.. నిండా ముంచేస్తున్న అక్రమార్కులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.