ETV Bharat / crime

ప్రేమజంటలను హత్య చేసి పగ తీర్చుకోవడం సరికాదు: సీపీ సీవీ ఆనంద్ - cp cv anand comments on neeraj case

హైదరాబాద్‌ బేగంబజార్‌లో ఇటీవల జరిగిన నీరజ్‌ పన్వర్‌ హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు చేపడుతున్నామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ప్రేమజంటలను హత్య చేసి పగ తీర్చుకోవడం సరికాదని అన్నారు.

CP CV ANAND ON NEERAJ CASE ISSUE
ప్రేమజంటలను హత్య చేసి పగ తీర్చుకోవడం సరికాదు: సీపీ సీవీ ఆనంద్
author img

By

Published : May 30, 2022, 5:44 PM IST

నీరజ్ హత్యకేసులో ఫాస్ట్ ట్రాక్‌కోర్టు ఏర్పాటు చేసి.... నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు చేపడతామని హైదరాబాద్ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్ వెల్లడించారు. హత్యకు సంబంధించిన ఆధారాలు సేకరించినట్లు తెలిపారు. ప్రేమ వివాహం చేసుకున్న నీరజ్‌ను 10 రోజుల క్రితం బేగంబజార్‌లో కత్తులతో పొడిచి చంపారు. అతడి భార్య సంజన, కుటుంబ సభ్యులను... ఆనంద్ పరామర్శించారు.

బేగంబజార్‌కు చెందిన మార్వాడి మాలీసమాజ్, యాదవ్ సమాజ్‌కు చెందిన పెద్దలతోనూ పోలీస్ కమిషనర్‌ చర్చించారు. నీరజ్ హత్య అనంతరం ఇరుకులాలు విమర్శలు చేసుకుంటున్న తరుణంలో వారిని కమిషనర్‌ హెచ్చరించారు.

'' నీరజ్ హత్య కేసులో ఇప్పటికే ఏడుగురిని అరెస్టు చేశాం. నీరజ్ హత్య కేసులో ఇరుపక్షాల పెద్దలను హెచ్చరించాం. ప్రేమజంటలను హత్య చేసి పగ తీర్చుకోవడం సరికాదు. పిల్లల ప్రవర్తనపై నిఘా పెట్టాలని పెద్దలను కోరుతున్నాం. నీరజ్ హత్య కేసు విచారణ వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం.'' - సీవీ ఆనంద్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌

నేటి యువత తమ ఇష్టానికి అనుగుణంగా జీవించాలని భావిస్తున్నారని తెలిపారు. అందులో భాగంగా కొంత మంది నచ్చిన వాళ్లను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారన్నారు. ప్రేమ వివాహం ఇష్టం లేకపోతే వాళ్లను పట్టించుకోకుండా వదిలేయండని సూచించారు. కక్ష పెంచుకొని హత్యలకు పాల్పడితే మాత్రం సహించేది లేదన్నారు. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీవీ ఆనంద్ హెచ్చరించారు. పిల్లల కదలికలపైనా తల్లిదండ్రులు నిఘా ఉంచాలని.. చెడు వ్యసనాల బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని సీవీ ఆనంద్ సూచించారు.

ప్రేమజంటలను హత్య చేసి పగ తీర్చుకోవడం సరికాదు: సీపీ సీవీ ఆనంద్

ఇవీ చూడండి:

మోదీ సర్కార్‌ రూపాయి కూడా దుర్వినియోగం చేయలేదు: కిషన్​రెడ్డి

ఒక్కొక్కరి అకౌంట్లో రూ.13 కోట్లు.. మొత్తం 100 మందికి.. ఎలా జరిగింది?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.