గర్భిణీ మృతికి కారణమైన ఓ ప్రైవేట్ ఆస్పత్రి ముందు బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ కూతురు మృతి చెందిందని ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. జిల్లాలోని మానకొండూరు మండలం అన్నారం గ్రామానికి చెందిన స్వరూప అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరింది. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు మందులు ఇచ్చి ఇంటికి పంపించారు. ఇంటికి వెళ్లిన స్వరూప నీరసానికి గురికాగా... తిరిగి బంధువులు ఆస్పత్రికి తీసుకొచ్చారు.
బీపీ తక్కువ ఉందంటూ తమ ఆస్పత్రిలో వెంటిలేటర్ల సౌకర్యం లేదని ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం మరో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే గర్భిణీ మరణించగా... బంధువులు మృతదేహంతో ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టారు. మల్టీస్పెషాలిటీ పేరుతో రోగులను తప్పుదారి పట్టిస్తున్న వైద్యులు ఆస్పత్రిలో వెంటిలేటర్ సౌకర్యం లేదని చెప్పడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు.