రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్కు చెందిన సీఐ, ఎస్‌ఐని సస్పెండ్ (Narsingi CI,SI Suspended) చేస్తూ... కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీచేశారు. గత కొంత కాలంగా సీఐ గంగాధర్, ఎస్‌ఐ లక్ష్మణ్.. భూవివాదాల్లో తలదూర్చినట్లు కమిషనర్ దృష్టికి వచ్చింది.
దీంతో పాటు వారిపై అవినీతి ఆరోపణలు వస్తుండడంతో సీపీ చర్యలు తీసుకున్నారు. అధికారాలను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వారి వ్యవహారంపై అంతర్గత విచారణకు ఆదేశించారు.
ఇదీ చదవండి: Road Accident: దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం... ఒకరు మృతి