ETV Bharat / crime

నిబంధనలు తుంగలో తొక్కిన కోచింగ్​ సెంటర్

నిజామాబాద్​లో ఓ వైపు కరోనా విజృంభిస్తుంటే... ప్రభుత్వ నిబంధనలు మరిచి ఓ కోచింగ్​ సెంటర్ నిర్వాహకులు పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నిబంధనలు తుంగలో తొక్కుతూ పాఠాలు చెప్పేందుకు సిద్ధమయ్యారు.

coaching center break rules in nizamabad district and its seized
నిబంధనలు తుంగలో తొక్కిన కోచింగ్​ సెంటర్
author img

By

Published : Apr 14, 2021, 8:55 AM IST

నిజామాబాద్​లోని ముప్కాల్​ మండల కేంద్రంలో లక్ష్మీ నరసింహ కోచింగ్ సెంటర్​ నిర్వాహకులు విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు వెళ్లేసరికి అక్కడ చిన్నారులకు పాఠాలు చెబుతున్నారు. దీనిపై మండల విద్యాశాఖ అధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోచింగ్​ సెంటర్​ను శాశ్వతంగా మూసివేయాలని సూచించారు.

ప్రభుత్వ జీవోను ఉల్లంఘించిన కోచింగ్​ సెంటర్​ను మూసివేశారు. సంబంధిత మెమోను యాజమాన్యానికి అందజేశారు. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే వారిపై సమీప పోలీస్​ స్టేషన్​లో క్రిమినల్​ కేసులు పెట్టేందుకు కూడా వెనకాడేది లేదని డీఈఓ బట్టు రాజేశ్వర్ హెచ్చరించారు.

ఇదీ చూడండి: రాష్ట్రాల నుంచి ప్రజల రాకపోకలు... జిల్లాల్లో పెరుగుతున్న కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.