ETV Bharat / crime

లాక్​డౌన్​లోనూ రెచ్చిపోతున్న గొలుసు దొంగలు - తెలంగాణ వార్తలు

సికింద్రాబాద్​ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. చంద్రపురి కాలనీలోని ఓ కిరణా దుకాణం లోపలికి వచ్చిన దుండగులు.. యజమాని అంజమ్మ మెడ నుంచి మూడున్నర తులాల మంగళసూత్రాన్ని అపహరించుకుని వెళ్లిపోయారు. నిన్న వెంకటేశ్వర కాలనీలో రేషన్ షాప్​ నుంచి వస్తున్నప్పుడు జరిగిన దొంగతనం మరువకముందే ఈ రోజు మరో చైన్ స్నాచింగ్ జరిగింది.

గొలుసు దొంగతనాల వార్తలు ,జవహర్ నగర్
chain snatching, Jawahar Nagar news
author img

By

Published : May 17, 2021, 12:09 PM IST

సికింద్రాబాద్ జవహర్ నగర్ పీఎస్ పరిధిలో లాక్​డౌన్​లోనూ గొలుసు దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస దొంగతనాలతో జనాలను భయపెడుతున్నారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంటల వ్యవధిలోనే వరుస చైన్ స్నాచింగ్​లు రాచకొండ కమిషనరేట్ పోలీసులకు సవాల్​గా మారాయి. ఆదివారం వెంకటేశ్వర కాలనీలో రేషన్ షాప్​కు వెళ్లి వస్తున్న మహిళ మెడలో నుంచి పుస్తెలతాడు లాక్కెళ్లిన ఘటన మరువకముందే ఈ రోజు చంద్రపురి కాలనీలో మరో ఘటన జరిగింది.

ఈ రోజు ఉదయం కిరాణా దుకాణంలో ఉన్న అంజమ్మ అనే మహిళ దృష్టిని మరల్చి.. ఆమె మెడలోని మూడున్నర తులాల మంగళసూత్రాన్ని అపహరించిన దుండగులు.. ద్విచక్రవాహనంపై పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఏసీపీ శివ కుమార్ బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఇదీ చూడండి: గంటగంటకు.. డబ్బులే డబ్బులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.